ముంబై ఎయిర్‌పోర్టులో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్..పొట్టలో దాచి మరీ స్మగ్లింగ్

దేశ ఆర్థిక రాజధాని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వజ్రాలు, బంగారంతో పాటు ఫారిన్ గంజాయిని అధికారులు పట్టుకున్నారు.

By Knakam Karthik  Published on  3 Feb 2025 11:42 AM IST
National News, Mumbai Airport, Drugs, Smugling

ముంబై ఎయిర్‌పోర్టులో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్..పొట్టలో దాచి మరీ స్మగ్లింగ్

దేశ ఆర్థిక రాజధాని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వజ్రాలు, బంగారంతో పాటు ఫారిన్ గంజాయిని అధికారులు పట్టుకున్నారు. సోదాల్లో రూ.55 కోట్ల విలువైన డైమండ్స్, బంగారం ఫారిన్ గంజాయిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఒక్క జనవరి నెలలోనే పెద్ద మొత్తంలో సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

మరో వైపు కస్టమ్స్ అధికారులు ఇటీవల జరిపిన సోదాల్లో రూ.16.49 కోట్ల విలువైన 1700 గ్రాముల కొకైన్ పట్టుకున్నారు. వినూత్న పద్ధతుల్లో కేటుగాళ్లు డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం సినీ పక్కినీ తలపిస్తోంది. డ్రగ్స్‌ను క్యాప్సూల్స్ రూపంలో పొట్టలో ఉంచుకుని అక్రమ రవాణాకు సిద్ధమైనట్లు అధికారులు గుర్తించారు. ఎయిర్‌పోర్టులో గ్రీన్ ఛానల్ ద్వారా వెళ్లేందుకు కేటుగాడు ప్రయత్నించాడు. అతని ట్రావెల్ హిస్టరీ ఆధారంగా కస్టమ్స్ అధికారులు అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. హాస్పిటల్‌కు తరలించి వైద్యుల సహాయంతో శస్త్రచికిత్స చేయగా.. పొట్టలో దాచిన డ్రగ్స్‌ను వెలికితీశారు.

సింగపూర్, ఇథియోపియా, బ్యాంకాక్, దుబాయ్‌తో పాటు కెన్యా నుంచి ఢిల్లీ వచ్చిన ఎనిమిది మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఒక కేటుగాడు బట్టలకు బదులు విదేశీ గంజాయి ప్యాకింగ్ చేసి తీసుకువచ్చాడు. మరికొంతమంది బంగారాన్ని పేస్ట్‌లా చేసి. ప్లాస్టిక్ కవర్‌లో ప్యాకింగ్ చేశారు. ఇలా రకరకాల పద్ధతుల్లో బంగారం, వజ్రాలు, గంజాయి తీసుకువస్తోన్న కేటుగాళ్లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

Next Story