మైనర్‌ బాలురపై లైంగిక దాడి.. హాస్టల్‌ వార్డెన్‌ అరెస్ట్‌

Hostel warden arrested for sexually abusing minors in Hyderabad. బాలుర హాస్టల్‌లో మైనర్లపై లైంగిక దాడికి పాల్పడిన ఓ స్కూల్ హాస్టల్ వార్డెన్‌ను హయత్‌నగర్ పోలీసులు అదుపులోకి తీ

By అంజి  Published on  11 Sept 2022 3:44 PM IST
మైనర్‌ బాలురపై లైంగిక దాడి.. హాస్టల్‌ వార్డెన్‌ అరెస్ట్‌

బాలుర హాస్టల్‌లో మైనర్లపై లైంగిక దాడికి పాల్పడిన శ్రీచైతన్య స్కూల్ హాస్టల్ వార్డెన్‌ను హయత్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి ప్రాంతానికి చెందిన ముర్రం కృష్ణ (35) అనే వ్యక్తి హయత్‌నగర్‌లోని బాలుర హాస్టల్‌లో వార్డెన్‌గా పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. "రాత్రి సమయంలో ముర్రం కృష్ణ.. హాస్టల్‌లోని బాలుర గదుల్లోకి వెళ్లి మైనర్‌లతో అసభ్యంగా ప్రవర్తించాడు. అతను బాత్రూమ్‌లలోకి వెళ్లి అబ్బాయిలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు" అని రాచకొండ పోలీసులు తెలిపారు.

కృష్ణ పెళ్లికాని కారణంగా 'లైంగిక నిరాశ' కారణంగా మైనర్‌లను లక్ష్యంగా చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో అతను చాలా మంది పిల్లలపై అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అంగీకరించాడు. అతనిపై పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. నిందితుడిపై ఐపీసీలోని ఆరు సెక్షన్ల కింద అభియోగాలు మోపబడ్డాయి. ఇందులో ఉద్దేశపూర్వకంగా శాంతిభద్రతలను రెచ్చగొట్టడం, విచ్ఛిన్నం చేయడం వంటి సెక్షన్లు 504, క్రిమినల్ బెదిరింపు కోసం 506 సెక్షన్లు ఉన్నాయి. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story