హెచ్‌ఐవీ సోకిన వ్యక్తి ఛిద్రమైన మృతదేహం లభ్యం.. ప్రైవేట్ భాగాలు నరికివేసి..

ఢిల్లీలోని పాలం విహార్ రైల్వే స్టేషన్ సమీపంలో హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. శరీరంపై అనేక కత్తి గాయాలు ఉన్నాయని, 25 ఏళ్ల యువకుడి ప్రైవేట్ భాగాలు కూడా నరికి ఉన్నాయని పోలీసులు తెలిపారు.

By అంజి  Published on  4 Dec 2024 2:24 AM GMT
HIV positive man, body found, Delhi, private parts chopped off, Crime

హెచ్‌ఐవీ సోకిన వ్యక్తి ఛిద్రమైన మృతదేహం లభ్యం.. ప్రైవేట్ భాగాలు నరికివేసి..

ఢిల్లీలోని పాలం విహార్ రైల్వే స్టేషన్ సమీపంలో హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. శరీరంపై అనేక కత్తి గాయాలు ఉన్నాయని, 25 ఏళ్ల యువకుడి ప్రైవేట్ భాగాలు కూడా నరికి ఉన్నాయని పోలీసులు తెలిపారు. బాటసారుడు మానవ అవశేషాలను గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు నవంబర్ 27న బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న గుర్తుతెలియని బాధితుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సమీపంలోనే ఆ వ్యక్తి ఫోన్ కూడా లభ్యమైంది.

నవంబర్ 25న ద్వారకా సెక్టార్ 23 పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ రిపోర్ట్ ప్రకారం.. బాధితుడు ఈ-కామర్స్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవాడు. దర్యాప్తులో, బాధితుడి తలపై భారీ రాయి లేదా ఇటుకతో కొట్టినట్లు ఢిల్లీ పోలీసులు కనుగొన్నారు. మృతదేహం దొరికిన ప్రాంతానికి సమీపంలోని సిసిటివి ఫుటేజీలో ఇద్దరు వ్యక్తులు అతనిని అనుసరిస్తూ పాలం విహార్ రైల్వే యార్డ్ వైపు వెళ్తున్నట్లు కనిపించింది. ఇద్దరు వ్యక్తులను పోలీసులు విచారించారు. కానీ వారికి, బాధితుడికి లేదా హత్యకు మధ్య సంబంధం లేదని తేలింది.

ఇదిలా ఉండగా బాధితుడికి వివాహమై హెచ్‌ఐవీ సోకడమే కాకుండా ఓ వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు అతడి ఫోన్‌లో చాటింగ్‌లో తేలింది. బాధితుడి స్వలింగ సంపర్కం లేదా ఏదైనా గొడవ అతని హత్యలో పాత్ర పోషిస్తుందా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

Next Story