హైదరాబాద్: మస్తాన్ సాయి ప్రైవేట్ వీడియోల వ్యవహారంలో లావణ్య అనే యువతి తన పేరు ప్రస్తావించడంపై టాలీవుడ్ హీరో నిఖిల్ స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఆ వీడియోలు కార్తికేయ-2 సినిమా సక్సెస్‌మీట్ తర్వాత జరిగిన డిన్నర్ పార్టీలోనివని చెప్పారు. తన కుటుంబ సభ్యులతో ఉన్న దృశ్యాలను తప్పుగా చూపిస్తున్నారని తెలిపారు. వాస్తవం పోలీసులకు కూడా తెలుసునని అన్నారు. అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని నిఖిల్ స్పష్టం చేశారు.
అంతకుముందు మస్తాన్ సాయిపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సాయి వందలాది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు రికార్డింగ్ చేయడంతో పాటు హీరో నిఖిల్ ఫోన్‌నూ కూడా హ్యాక్ చేశాడని లావణ్య చెప్పింది. ఫోన్‌లోని ప్రైవేట్ పార్టీ వీడియోలను హార్డ్ డిస్క్‌లో సేవ్ చేసుకున్నాడని, అమ్మాయిలకు డ్రగ్స్ అలవాటు చేసి న్యూడ్ వీడియో కాల్స్ రికార్డింగ్ చేశాడని, బెదిరిస్తూ లైంగిక దాడులకు పాల్పడ్డాడని లావణ్య ఆరోపించారు. అటు మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.