మాస్కు పెట్టుకొలేదని తన గదిలోకి రమ్మని.. విద్యార్థినిపై ప్రిన్సిపాల్‌ అత్యాచారం

Headmaster sexual assault on student in Medchal. మేడ్చల్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు చెప్పి విద్యార్థులను సరైన మార్గంలో నడిపించాల్సిన ఓ ప్రిన్సిపాల్‌కు కళ్లు

By అంజి  Published on  30 Dec 2021 3:03 AM GMT
మాస్కు పెట్టుకొలేదని తన గదిలోకి రమ్మని.. విద్యార్థినిపై ప్రిన్సిపాల్‌ అత్యాచారం

మేడ్చల్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు చెప్పి విద్యార్థులను సరైన మార్గంలో నడిపించాల్సిన ఓ ప్రిన్సిపాల్‌కు కళ్లు కామంతో మూసుకుపోయాయి. మాస్కు పెట్టుకొలేదన్న కారణంతో ఓ విద్యార్థిని తన గదిలో రప్పించి అత్యాచారానికి పాల్పడ్డాడు స్కూల్‌ ప్రిన్సిపల్‌. చివరికి ఏడు రోజుల తర్వాత మాజీ ప్రిన్సిపాల్‌ జోక్యంతో విషయం బయటపడింది. ఈ ఘటన శామీర్‌ పేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేట్‌ స్కూల్‌లో 15 ఏళ్ల ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. డిసెంబర్‌ 22వ తేదీన కూడా బాలియ యథావిధిగా స్కూల్‌కు వెళ్లింది. అయితే బాలిక మాస్కు పెట్టుకోలేదన్న కారణంతో తన గదిలోకి రావాలని ప్రిన్సిపాల్‌ ఆదేశించాడు. దీంతో ఆ గదిలోకి వెళ్లిన తర్వాత విద్యార్థినిపై ప్రిన్సిపాల్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. బాలిక భయపడి ఎవరికీ కూడా జరిగిన విషయం చెప్పలేదు.

అయితే బుధవారం నాడు తాను చదువుతున్న స్కూల్‌లో గతంలో ప్రిన్సిపాల్‌గా పని చేసిన మహిళా టీచర్‌ను కలిసిన సందర్భంలో బాలిక జరిగిన దారుణాన్ని వెల్లడించింది. మహిళా టీచర్‌ ధైర్యం చెప్పడంతో బాలిక, ఆమె తల్లి పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు. విషయం బయటికి తెలియడంతో ఓ పార్టీ నాయకులు స్కూల్‌ ప్రిన్సిపల్‌కు మద్దతుగా నిలిచి.. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిహారం ఇప్పిస్తామని చెప్పారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మరో పార్టీ నాయకులు బాధితురాలి కుటుంబానికి మద్ధతుగా నిలిచారు. దీంతో బాలిక తల్లి లిఖిత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ స్కూల్‌ ప్రిన్సిపాల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Next Story
Share it