విద్యార్థినిలను రెచ్చగొట్టి తప్పుడు లైంగిక ఫిర్యాదు.. ప్రధానోపాధ్యాయుడికి ఎస్పీ వార్నింగ్‌

Headmaster 'instigates' schoolgirls to file 'fake' sexual harassment complaint against teacher. రెండు నెలల క్రితం మధురైలో పోక్సో చట్టం కింద నమోదైన కేసు అబద్ధమని తేలింది. మధురై జిల్లా పోలీసు కార్యాలయం

By అంజి  Published on  3 Nov 2022 5:47 PM IST
విద్యార్థినిలను రెచ్చగొట్టి తప్పుడు లైంగిక ఫిర్యాదు.. ప్రధానోపాధ్యాయుడికి ఎస్పీ వార్నింగ్‌

రెండు నెలల క్రితం మధురైలో పోక్సో చట్టం కింద నమోదైన కేసు అబద్ధమని తేలింది. మధురై జిల్లా పోలీసు కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. కరుప్పయూరాణి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 'చైల్డ్‌లైన్ 1908 సేవ'కు ఫోన్ చేసి తమ పాఠశాలలోని ఫిర్యాదు పెట్టెలో ఇద్దరు బాలికలు రాసిన లేఖలు లభించాయని వారికి తెలియజేశారు. పాఠశాల ఉపాధ్యాయుడు తమతో అసభ్యంగా ప్రవర్తించాడని, చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఆరోపణల ఆధారంగా మధరై జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముగ్గురు ఉపాధ్యాయులతో విచారణ జరిపారు. తరువాత కరుప్పయూరాణి పోలీసులు ఆగస్టు 6, 2022 న పోక్సో కేసు నమోదు చేశారు.

అయితే ఓ మహిళా ఉపాధ్యాయురాలు ఆగస్టు 8న సౌత్ జోన్ ఐజీ అస్రా గార్గ్‌ను సంప్రదించి.. విద్యార్థులు మోపిన అభియోగాలు అవాస్తవమని వాంగ్మూలం ఇచ్చింది. ఉపాధ్యాయుల మధ్య శత్రుత్వం నెలకొని ఇలాంటి తప్పుడు ఆరోపణలకు కారణమైంది. ఈ ఆరోపణలపై న్యాయమైన విచారణ జరిపించాలని పిటిషనర్ ఐజీని కోరారు. ఐజీ ఆదేశాల మేరకు మధురై రేంజ్ డీఐజీ ఆర్ పొన్ని, ఎస్పీ ఆర్ శివ ప్రసాద్ ఆధ్వర్యంలో ఊమాచికుళం ఏడబ్ల్యూపీఎస్ ఇన్‌స్పెక్టర్.. ఇద్దరు విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో విచారణ జరిపారు. ఆ తర్వాత విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు రెచ్చగొట్టినట్లు గుర్తించారు.

బాలికలు తాము రాసిన లేఖ కల్పితమని అంగీకరిస్తూ.. పిటి ఉపాధ్యాయుడు తమతో అనుచితంగా ప్రవర్తించలేదని చెప్పారు. అంతేకాకుండా, విద్యార్థులు కూడా ఇదే విషయాన్ని న్యాయస్థానం ముందు అంగీకరించారు. చివరగా ప్రధానోపాధ్యాయుడు శత్రుత్వం కారణంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌తో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులపై తప్పుడు ఫిర్యాదు చేసినట్లు స్పష్టమైంది. వీటన్నింటితో ఆగస్ట్ 11న ఊమాచికుళం ఏడబ్ల్యూపీఎస్ తుది నివేదికను అందజేసింది. సాక్షులను విచారించిన ప్రత్యేక న్యాయస్థానం అక్టోబర్ 31న కేసును కొట్టివేసింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం విద్యార్థులను రెచ్చగొట్టినందుకు హెచ్‌ఎంపై మదురై ఎస్పీ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.


Next Story