రెండు రోజుల పరిచయం.. మూడో రోజు ఫ్రెండ్‌ రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారం

He took her to a friend's room in Hyderabad and sexually assaulted her. హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగు చూసింది. రెండు రోజుల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయిన యువతిని.. నమ్మించి

By అంజి  Published on  2 March 2022 8:16 AM IST
రెండు రోజుల పరిచయం.. మూడో రోజు ఫ్రెండ్‌ రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారం

దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఛాన్స్‌ దొరికితే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొందరు మానవ మృగాలు. కామ దాహాంతో మహిళలపై దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగు చూసింది. రెండు రోజుల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయిన యువతిని.. నమ్మించి వెంట తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ యువకుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్‌నగర్‌కు చెందిన యువతి (20)కి రెండు రోజుల క్రితం రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సులేమాన్‌నగర్‌లో నివసించే సాజిత్‌ అనే ప్రైవేట్‌ ఉద్యోగితో పరిచయం ఏర్పడింది.

ఈ క్రమంలోనే ఇద్దరు ఫోన్‌ నంబర్ల తీసుకొని వాట్సాప్‌ చాటింగ్‌ చేసుకున్నారు. మంగళవారం నాడు పలాన చోట కలవాలని సాజిత్‌ యువతిని కోరాడు. యువకుడిని నమ్మిన యువతి రాజేంద్రనగర్‌కు వచ్చింది. అక్కడ ఆ యువతిని తన బైక్‌పై ఎక్కించుకుని సులేమాన్‌నగర్‌లో ఉండే ఫ్రెండ్‌ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ యువతిపై బలవంతంగా అత్యాచారం చేశాడు. అక్కడి నుండి తప్పించుకున్న యువతి 100కు కాల్‌ చేయడంతో పోలీసుల అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్రనగర్‌ సీఐ తెలిపారు.

Next Story