వితంతువుపై అత్యాచారం.. కళ్లలో కారం పోసి, జననాంగాలపై ఇనుప రాడ్‌తో కొట్టి..

ఉత్తరాఖండ్ రాష్ట్రం హ‌రిద్వార్‌లోని సిద్కుల్ ప్రాంతంలో ఓ వితంతువుపై దారుణానికి ఒడిగట్టిన కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

By Medi Samrat
Published on : 16 May 2025 2:28 PM IST

వితంతువుపై అత్యాచారం.. కళ్లలో కారం పోసి, జననాంగాలపై ఇనుప రాడ్‌తో కొట్టి..

ఉత్తరాఖండ్ రాష్ట్రం హ‌రిద్వార్‌లోని సిద్కుల్ ప్రాంతంలో ఓ వితంతువుపై దారుణానికి ఒడిగట్టిన కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. నిందితుల బంధువులు, పరిచయస్తులను విచారించిన పోలీసులు.. రహస్య స్థావరాలపై దాడులు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభించలేదు. అయితే.. AIIMS రిషికేశ్‌లో చేరిన బాధితురాలి పరిస్థితిలో మెరుగుదల క‌నిపించింది. సిడ్‌కుల్ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ముజఫర్‌నగర్‌కు చెందిన వితంతువుపై.. తెలిసిన ఫ్యాక్టరీ ఉద్యోగి అత్యాచారం చేశాడు.

సహదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్ పత్రికి చెందిన నిందితుడు రజత్.. మహిళపై అత్యాచారం చేసిన తర్వాత ఆమె కళ్లలో కారం పోసి, ఆమె జననాంగాలపై ఇనుప రాడ్‌తో కొట్టి చంపడానికి ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన మహిళను పొరుగున నివసించే ఆరిఫ్ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ నుండి ప్రథమ చికిత్స తర్వాత ఆమెను ఎయిమ్స్ రిషికేశ్‌కు తరలించారు. ఘటన జరిగినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు.

సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ప్రమేంద్ర సింగ్‌ దోబాల్‌ ఆదేశాల మేరకునిందితుడిని అరెస్టు చేసేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. గురువారం నిందితుడికి తెలిసిన కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడి బంధువుల ఇళ్లతో పాటు అతడి స్నేహితులు, సన్నిహితుల ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు.

నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్‌ఐడీసీయూఎల్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి మనోహర్ సింగ్ భండారీ తెలిపారు. మరోవైపు బాధితురాలిని ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించిన తర్వాత ఆమె పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంది. వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది.

Next Story