మాదాపూర్‌లో కాల్పుల కలకలం.. ఒకరు మృతి

Gun firing at Madhapur one dead.హైదాబాద్‌లోని మ‌దాపూర్‌లో కాల్పులు క‌లక‌లం సృష్టించాయి. సోమ‌వారం తెల్ల‌వారుజామున

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Aug 2022 7:54 AM IST
మాదాపూర్‌లో కాల్పుల కలకలం.. ఒకరు మృతి

హైదాబాద్‌లోని మ‌దాపూర్‌లో కాల్పులు క‌లక‌లం సృష్టించాయి. సోమ‌వారం తెల్ల‌వారుజామున నీరూస్ స‌ర్కిల్ వ‌ద్ద కారులో వెలుతున్న రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్‌పై బైక్ పై వ‌చ్చిన ఓ దుండ‌గుడు కాల్పులు జ‌రిపాడు. ఈ ఘ‌ట‌న‌లో ఇస్మాయిల్ మ‌ర‌ణించ‌గా మ‌రో వ్య‌క్తికి గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఇస్మాయిల్ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. క్లూస్‌ టీం ఆధారాలు సేకరిస్తోంది. పోలీసులు సీసీపుటేజ్‌ల‌ను ప‌రిశీలిస్తున్నారు.

కాల్పుల‌కు జ‌రిపిన వ్య‌క్తిని ముజీబ్‌గా గుర్తించారు. బైక్‌పై వ‌చ్చిన ముజీబ్ కారులో ఉన్న ఇస్మాయిల్‌పై పాయింట్ బ్లాంక్‌లో మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జ‌రిపార‌ని పోలీసులు తెలిపారు. నిందితుడిని ప‌ట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేప‌ట్టారు. కాల్పుల‌కు రియ‌ల్ ఎస్టేట్ వివాదాలే కార‌ణంగా బావిస్తున్నారు. గాయ‌ప‌డిన మ‌రో వ్య‌క్తికి చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇస్మాయిల్, మజీబ్ లు ఇద్దరు రౌడీషీటర్లు. జైలులో ఏర్పడ్డ పరిచయంతో ఇరువురు సెలిట్‌మెంట్ ల‌ కోసం ముఠాగా ఏర్పడినట్లు స‌మాచారం. డబ్బు పంపకంలో ఏర్పడ్డ విబేధాల వల్ల వీరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.

Next Story