గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

Gujarat Road accident.. 10 dead .. గుజరాత్‌లోని వడోదరలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

By సుభాష్  Published on  18 Nov 2020 5:05 AM GMT
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

గుజరాత్‌లోని వడోదరలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందగా, 17 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వాఘెడియా క్రాసింగ్ వద్ద రెండు ట్రక్కులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు కూడా నుజ్జు నుజ్జు అయ్యాయి.

ప్రమాదంతో రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అయితే ముందుగా ప్రమాద స్థలంలో 9 మంది మృతి చెందగా, గాయాలైన వారిలో మరొకరు మృతి చెందారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ తీవ్ర దిగ్బ్రంతి వ్యక్తం చేశారు.

Next Story
Share it