ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆపై రాడ్‌ చొప్పించి హత్య.. నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు

ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆమె ప్రైవేట్ భాగాల్లో రాడ్‌ను చొప్పించిన వ్యక్తికి గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలోని ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది.

By -  అంజి
Published on : 18 Jan 2026 1:30 PM IST

Gujarat, death sentence, Crime,Rajkot, Atkot

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆపై రాడ్‌ చొప్పించి హత్య.. నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు

ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆమె ప్రైవేట్ భాగాల్లో రాడ్‌ను చొప్పించిన వ్యక్తికి గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలోని ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసు విచారణ నేరం జరిగినప్పటి నుండి 45 రోజుల్లోపు లేదా 1.5 నెలల్లోపు పూర్తయింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వి.ఎ. రాణా జనవరి 12న తీర్పు వెలువరించగా, శనివారం శిక్షను ప్రకటించారు. డిసెంబర్ 4న అట్కోట్ సమీపంలో లైంగిక దాడి జరిగింది.

బాలిక బయట ఆడుకుంటుండగా, ముగ్గురు పిల్లల తండ్రి అయిన రాంసింగ్ దుద్వా సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి చేసి గొంతు కోసి చంపాడు. తీవ్ర రక్తస్రావంతో బాలిక చనిపోయింది. నాలుగు రోజుల తర్వాత డిసెంబర్ 8న దోషిని అరెస్టు చేశారు. పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి, 11 రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశారు. బాలిక తండ్రి నిందితుడిపై వెంటనే కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోర్టుకు వివరణాత్మక లేఖ రాశారు. పరిస్థితి తీవ్రత, సంఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, కేసును రోజువారీ విచారణకు ఆదేశించింది. కోర్టు ముందు సాక్ష్యాల నమోదు కేవలం ఆరు రోజుల్లోనే పూర్తయింది.

Next Story