గుజరాత్‌లోని భావ్‌నగర్‌లోని ఓఏజే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో జరిగిన ఘర్షణ తర్వాత ఒక బాలుడిని కత్తితో పొడిచి చంపిన కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఇన్స్టిట్యూట్ కౌన్సెలింగ్ గదిలో జరిగింది. అక్కడ కార్తీక్ అనే బాలుడిని ఒక ఉపాధ్యాయుడి సమక్షంలో పిలిపించారు. దుండగుడిని జగదీష్ రాచడ్ గా గుర్తించారు. కార్తీక్ తన కుమార్తెతో ఫోన్లో మాట్లాడుతున్నాడని చెప్పి అతనిపై జగదీష్ దాడి చేశాడు. దాడి తర్వాత, గాయపడిన బాలుడిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టీచర్ బాలుడిని కౌన్సెలింగ్ కోసం గదికి పిలిచినప్పుడు, జగదీష్ రాచడ్ అతని దగ్గరకు వచ్చి, తన కుమార్తెతో మాట్లాడవద్దని హెచ్చరించాడు. తీవ్ర వాగ్వాదం జరిగింది. కొన్ని క్షణాల తర్వాత, జగదీష్ రాచడ్ సహనం కోల్పోయి ఆ బాలుడిని కత్తితో పొడిచాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు, ఆ తర్వాత జగదీష్ రాచడ్‌ను అరెస్టు చేశారు. ఈ విషయంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.