Hyderabad : నాలుగేళ్ల‌ చిన్నారి కిడ్నాప్.. 24 గంటల్లోనే కాపాడిన పోలీసులు

గోల్కొండ పరిధిలో జ‌రిగిన కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. 24 గంటల్లోనే నిందితుల‌ను ప‌ట్టుకున్నారు.

By -  Medi Samrat
Published on : 23 Nov 2025 7:30 PM IST

Hyderabad : నాలుగేళ్ల‌ చిన్నారి కిడ్నాప్.. 24 గంటల్లోనే కాపాడిన పోలీసులు

గోల్కొండ పరిధిలో జ‌రిగిన కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. 24 గంటల్లోనే నిందితుల‌ను ప‌ట్టుకున్నారు. ఆ వివ‌రాల‌ను అడిషనల్ డీసీపీ కృష్ణ గౌడ్ మీడియాకు వెల్ల‌డించారు. ఈనెల 21న ఫాతిమా అనే మ‌హిళ తన నాలుగేళ్ల రెండో కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. దీంతో 9 ప్రత్యేక బృందాలతో చిన్నారి కోసం గాలించామ‌ని తెలిపారు. సీసీ పుటేజీల‌ను పరిశీలించగా.. ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేయడం గుర్తించామ‌ని.. ఒకరు బురఖాలో ఉన్నారని.. ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లడం రికార్డ‌య్యింద‌ని.. ఆటో నెంబర్ ఆధారంగా కిడ్నాపర్లను గుర్తించామ‌ని తెలిపారు.

సల్మా బేగం, మహమ్మద్ ఫయాజ్ అనే ఇద్దరు నిందితులను గుర్తించామని.. వీరు ఇద్దరూ భార్య భర్తలు.. నాలుగేళ్ల క్రితం విడిపోయారని.. ఫయాజ్ రెండో పెళ్లి చేసుకోగా.. సల్మా బేగం మళ్ళీ ఫయాజ్‌తో కాంటాక్ట్ లోకి వచ్చింది.. మళ్ళీ కలిసి ఉందాం అని చెప్పింది.. మనం విడిపోయే ముందు నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను అని.. మనకు నాలుగేళ్ల పాప ఉందని అబద్ధం చెప్పింది. దీంతో క‌లిసివుండ‌టానికి ఫయాజ్ ఒకే చెప్పడంతో.. నాలుగేళ్ల పాప కోసం రెక్కీ నిర్వహించింది. గోల్కొండ పరిధిలో నాలుగేళ్ల పాపను గుర్తించి కిడ్నాప్ చేసింది. కొంత దూరం వచ్చిన తర్వాత ఫయాజ్ కి కాల్ చేసింది. ఫయాజ్ ఆటోలో వచ్చి పాపను, సల్మా బేగంను తీసుకెళ్లాడ‌ని వివ‌రించారు. ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ జ‌రుగుతున్న‌ట్లు వెల్ల‌డించారు.

Next Story