ఎస్సైని కొడవలితో నరికి.. హత్య చేసిన మేకల దొంగలు.. సీఎం రూ.కోటి ఆర్థిక సాయం
Goat thieves kill SI Bhuminathan with a machete. తమిళనాడులో దారుణ హత్య చోటు చేసుకుంది. ఓ పోలీసు అధికారిని మేకలు దొంగలు హత్య చేశారు.
By అంజి Published on 22 Nov 2021 4:44 AM GMTతమిళనాడులో దారుణ హత్య చోటు చేసుకుంది. ఓ పోలీసు అధికారిని మేకలు దొంగలు హత్య చేశారు. ఈ దారుణ పుదుక్కోట్టై జిల్లా పరిధిలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుచ్చి జిల్లా నవల్‌పట్టులో భూమినాథన్(55) ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పుదుక్కోట్టై జిల్లా కీరనూర్ సమీపంలో కలమావూర్ దగ్గర గస్తీ చేపట్టారు. ఆదివారం తెల్లవారంగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై మేకను పట్టుకుని వెళ్తున్నారు. వారిని ఆపేందుకు భూమినాథన్ ప్రయత్నింగా.. వారు ఆపకుండా వెళ్లిపోయారు.
దీంతో భూమినాథన్, మరో పోలీస్ చిత్తిరైవేల్ వేరు వేరు బైక్‌లతో వారిని వెంబడించారు. ఈ క్రమంలోనే తిరుచ్చి జిల్లా సరిహద్దు పళ్లత్తుపట్టి అనే ప్రాంతంలో భూమినాథన్‌ను మేకల దొంగలు బంధించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకునే లోపే భూమినాథన్‌ను దుండగులు కొడవలితో కిరాతంగా హత్య చేసి పారిపోయారు. మృతదేహాన్ని కీరనూర్ పోలీసులు స్వాధీనం చేసుకుని తిరుచ్చి జీజీహెచ్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని పుదుక్కోట్టై ఎస్పీ, తిరుచ్చి నగర పోలీస్ కమిషనర్ పరిశీలించారు.
నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 8 ప్రత్యేక బృందాలతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. రూ.కోటి ఆర్థిక సాయంతో పాటు భూమినాథన్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ఎస్సై భూమినాథన్ మృతిపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న పోలీసుల హత్యలను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం రూపొందాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సై భూమినాథన్ అంత్యక్రియలను ఆయన స్వగ్రామం తిరుచ్చి సోలమానగర్‌లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.