బెడ్‌ తడిపిందని.. బాలిక ప్రైవేట్ పార్ట్‌లకు గాయాలు చేశారు.. ముగ్గురు అరెస్ట్‌

రెండున్నరేళ్ల బాలికపై అకృత్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కేరళ పోలీసులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని బాలల గృహంలో ముగ్గురు కేర్‌టేకర్లను అరెస్టు చేశారు.

By అంజి  Published on  5 Dec 2024 8:18 AM IST
Girl private parts injured, wetting bed, Kerala home, arrest, Crime

బెడ్‌ తడిపిందని.. బాలిక ప్రైవేట్ పార్ట్‌లకు గాయాలు చేశారు.. ముగ్గురు అరెస్ట్‌

రెండున్నరేళ్ల బాలికపై అకృత్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కేరళ పోలీసులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని బాలల గృహంలో ముగ్గురు కేర్‌టేకర్లను అరెస్టు చేశారు. నిందితులు అజిత, మహేశ్వరి, సింధు. వీరు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, జువైనల్ జస్టిస్ (జెజె) చట్టం కింద అభియోగాలను ఎదుర్కొంటున్నారు. బెడ్‌ తడిపినందుకు శిక్షగా చిన్నారి ప్రైవేట్ పార్ట్‌లకు కేర్‌టేకర్లు గాయాలు చేశారని పోలీసులు తెలిపారు.

బాలిక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతోంది. ఆమె ఆస్పత్రికి తరలించగా వైద్య పరీక్షల్లో ప్రైవేట్‌పార్ట్‌ వద్ద వేలిగోళ్ల గుర్తులు కనిపించాయి. గాయం కనుగొనబడటానికి ఒక వారం ముందు ఈ ఘటన జరిగిందని అధికారులు భావిస్తున్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రధాన కార్యదర్శి అరుణ్ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన జరిగిన వారం రోజులుగా విధుల్లో ఉన్న సిబ్బంది అందరినీ విధుల నుంచి తొలగించారు. తల్లిదండ్రులు చనిపోవడంతో బాలిక, ఆమె చెల్లెలు అక్కడే ఉంటున్నారు. ఈ ఘటన ఇప్పుడు కేరళ రాష్ట్రంలో దుమారం రేపుతోంది.

Next Story