కుటుంబ సభ్యులతో కలిసి.. ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు
యూపీలోని రాయ్‌బరేలీలో వివాహిత ప్రియురాలు కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడిని హత్య చేసింది.
By అంజి Published on 23 Feb 2023 2:33 PM ISTప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రియురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడిని హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసింది. ప్రియురాలికి ఇప్పటికే పెళ్లయిందని స్థానికులు చెబుతున్నారు. ఆమె తన భర్తతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ప్రియుడికి కోపం వచ్చింది. ప్రియురాలిని కలిసేందుకు అక్కడికి రాగానే హత్యకు గురయ్యాడు. మృతుడి బంధువులు లక్నోలోని గోమతి నగర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.
సమాచారం ప్రకారం.. హైదర్‌గఢ్‌కు చెందిన భగవాన్ దాస్ అలియాస్ బబ్లూ యాదవ్, మహరాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూనమ్ అనే మహిళతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. పూనమ్‌కి ఇది వరకే పెళ్లయింది. భగవాన్ దాస్ తన గర్ల్ ఫ్రెండ్ పూనమ్ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడని చెబుతున్నారు. పూనమ్ డెలివరీ సమయంలో కూడా భగవాన్ దాస్ ఆమె కోసం మూడు లక్షల రూపాయలు ఖర్చు చేశాడు.
కాగా.. పూనమ్ తన భర్తతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో కోపోద్రిక్తుడైన భగవాన్ దాస్ పూనమ్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీని తర్వాత పూనమ్ తన కుటుంబ సభ్యులతో కలిసి కుట్రతో భగవాన్ దాస్‌ను హత్య చేసింది. హత్య అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేశారు. భగవాన్ దాస్ గురించి ఏమీ తెలియకపోవడంతో అతని బంధువులు గోమతి నగర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు.
బబ్లూ యాదవ్ అనే వ్యక్తి గోమతి నగర్ లక్నో నివాసి అని పోలీసు సూపరింటెండెంట్ అలోక్ ప్రియదర్శి తెలిపారు. అతను మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ కార్మికుడు. అతను కొన్ని రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. నాలుగైదు రోజులు వెతికినా కనిపించకపోవడంతో ఫిబ్రవరి 14న మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పుడు.. అతని చివరి లోకేషన్ మహరాజ్‌గంజ్ కేద్వా గ్రామంలో కనుగొనబడింది. అనంతరం స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు.
విషయం తెలుసుకున్న మహరాజ్‌గంజ్ పోలీసులు గ్రామానికి వెళ్లి చూడగా.. గోమతి నగర్‌లోని బబ్లూ యాదవ్ ఇంటి ముందు గ్రామానికి చెందిన ఓ మహిళకు వివాహం జరిగినట్లు సమాచారం. బబ్లూ ఆ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడు. పోలీసులు విచారించి మహిళ కుటుంబ సభ్యులను కఠినంగా ప్రశ్నించగా నేరం అంగీకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 14న రాత్రి బబ్లూ రాగానే హత్య చేసి మృతదేహాన్ని విసిరేశారు. బబ్లూ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.