షాకింగ్.. ప్రియుడి మర్మాంగం కోసేసింది
పాట్నాలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ గదిలో ఓ వ్యక్తి మర్మంగాన్ని అతని
By అంజి Published on 9 Jun 2023 1:15 PM ISTషాకింగ్.. ప్రియుడి మర్మాంగం కోసేసింది
బీహార్: పాట్నాలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ గదిలో ఓ వ్యక్తి మర్మంగాన్ని అతని ప్రియురాలు కత్తితో కోసేసింది. రెండు రోజుల క్రితం వీరిద్దరూ కోర్టులో పెళ్లి చేసుకున్నారు. ఆ వ్యక్తిలోని 60 శాతం ప్రైవేట్ పార్ట్ కోతకు గురైంది. అతడి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడి ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియురాలు పాట్నాలో ఉంటూ చదువుకుంటుంది. ఆమె దర్భంగా నివాసి.
బాధితుడు సూర్యభూషణ్ కుమార్ మాట్లాడుతూ ''నేను నా స్నేహితురాలు మూడేళ్లుగా ప్రేమలో ఉన్నాను. జూన్ 23న మరో అమ్మాయితో నా పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈ విషయం ప్రియురాలికి తెలిసింది. ఫోన్ చేసి పాట్నాకు రండి లేదంటే చచ్చిపోతాను అంది. ఆమె బెదిరింపు తర్వాత నేను జూన్ 3 న సుక్మా నుండి పాట్నా చేరుకుని ఒక హోటల్‌లో బస చేశాను. జూన్ 5న పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడం ప్రారంభించింది. జూన్ 5న, అతను ఆమెతో కలిసి సిటీ కోర్టుకు వెళ్లాను. అక్కడ మేం ఇద్దరం వివాహం చేసుకున్నాం'' అని చెప్పాడు.
ఆ తర్వాత ఇద్దరూ హోటల్‌లో బస చేశారు. తాను ఇన్నర్‌వీర్ వేసుకున్నానని ఆ వ్యక్తి చెప్పాడు. ఇంతలో ప్రియురాలు పెళ్లి నిశ్చయమైన అమ్మాయితో ఆ బంధాన్ని మానుకో అని చెప్పగా.. దీనిపై యువకుడు నిరాకరించాడు. దీంతో వాగ్వాదం జరగడంతో ప్రియురాలు కోపంతో బ్యాగ్‌లోంచి కత్తి తీసి ప్రైవేట్ పార్ట్ కోసింది. ప్రేమికుడు కేకలు వేస్తూ కిందకు దిగి రావడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమికుడిని వెంటనే చికిత్స నిమిత్తం పీఎంసీహెచ్‌కు పంపించారు. ప్రస్తుతం అతను తన తెగిపోయిన ప్రైవేట్ పార్ట్‌తో ఆసుపత్రిలో ఉన్నాడు.