17 ఏళ్ల బాలికను తుపాకీతో కాల్చిన తమ్ముడు.. తల్లిదండ్రులు ఏం చేశారంటే?

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికపై ఆమె టీనేజ్ సోదరుడు కాల్పులు జరిపిన ఘటన కవి నగర్‌లోని వారి ఇంట్లో జరిగింది.

By అంజి  Published on  26 Jan 2024 11:28 AM IST
Kavi Nagar, Ghaziabad, Crime news

17 ఏళ్ల బాలికను తుపాకీతో కాల్చిన తమ్ముడు.. తల్లిదండ్రులు ఏం చేశారంటే?

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికపై ఆమె టీనేజ్ సోదరుడు కాల్పులు జరిపిన ఘటన కవి నగర్‌లోని వారి ఇంట్లో జరిగింది. తమ ఇంటి బయట తమ కుమార్తెపై దుండగులు దాడి చేశారని బాలిక తల్లిదండ్రులు, విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. గాయపడిన బాలికను తీసుకెళ్లిన ప్రైవేట్ ఆసుపత్రి తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రి అధికారులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఎడమ భుజం క్రింద బుల్లెట్ గాయంతో బాలికను చేర్చారు. కేవీ నగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన బృందం ఆసుపత్రిని సందర్శించి బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు.

“వారు మమ్మల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం, 12వ తరగతి చదువుతున్న తమ కుమార్తె పాఠశాలకు వెళుతుండగా వారి ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెపై కాల్పులు జరిపారు” అని చెప్పారని అభిషేక్ శ్రీవాస్తవ, కవి నగర్ ఏసీపీ శుక్రవారం తెలిపారు. ఐపీసీ సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) కింద గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయబడింది. ఆ తర్వాత దర్యాప్తు ప్రారంభించబడింది. పోలీసులు ఇరుగుపొరుగు వారిని ప్రశ్నించారు, కానీ వారిలో ఎవరూ తల్లిదండ్రుల వాదనను ధృవీకరించలేదు. సీసీటీవీ ఫుటేజీలో కూడా దాడి జరిగినట్లు కనిపించలేదు.

“కాబట్టి, మేము అమ్మాయి తల్లిదండ్రులను, ఆమె సోదరుడిని ప్రశ్నించాము. కూలంకషంగా విచారించిన తర్వాత బాలిక సోదరుడు విరుచుకుపడి, కోపంతో ఆమెపై కాల్పులు జరిపినట్లు అంగీకరించాడు. అతను మైనర్, అదుపులోకి తీసుకున్నట్లు'' శ్రీవాస్తవ చెప్పారు. బుల్లెట్ పేల్చిన కంట్రీ మేడ్ పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోకి తుపాకీ ఎలా వచ్చిందో ఆరా తీస్తున్నారు పోలీసులు. “బాలుడి వయసు 15. ఇంట్లోనే తుపాకీ దొరికిందని చెప్పాడు. తుపాకీని ఎవరు తీసుకొచ్చారో తెలియాల్సి ఉంది. సంఘటనల క్రమం స్పష్టంగా వచ్చిన తర్వాత ఎఫ్‌ఐఆర్‌లో తగిన సెక్షన్లు జోడించబడతాయి” అని శ్రీవాస్తవ చెప్పారు.

Next Story