మిస్డ్ కాల్‌తో.. వీడిన 11 ఏళ్ల బాలిక హత్య మిస్టరీ
ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో ఫిబ్రవరి 9న 11 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన
By అంజి Published on 24 Feb 2023 3:00 PM ISTవీడిన 11 ఏళ్ల బాలిక హత్య మిస్టరీ
ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో ఫిబ్రవరి 9న 11 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో ఆమె తల్లి ఫోన్‌కు వచ్చిన మిస్డ్ కాల్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. 11 ఏళ్ల బాలికను హత్య చేసిన కేసులో రోహిత్ అలియాస్ వినోద్ అనే 21 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలిక తల్లి మాట్లాడుతూ.. ఫిబ్రవరి 9 న తన కుమార్తె ఉదయం 7.30 గంటలకు పాఠశాలకు ఇంటి నుండి బయలుదేరిందని చెప్పారు. ఆమె సోదరుడు ఆమెను పాఠశాలలో దించేవాడు. కానీ ఆ రోజు ఆమె బస్సులో వెళ్ళిందని చెప్పారు.
రాత్రి 11.00 గంటల వరకు ఆమె తిరిగి రాకపోవడంతో, వారు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. కానీ ఆమె ఆచూకీ లభించలేదు. సాయంత్రం వరకు బాలిక ఇంటికి రాకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఉదయం 11.50 గంటల సమయంలో తనకు మిస్డ్ కాల్ వచ్చిందని, తిరిగి కాల్ చేస్తే నంబర్ స్విచ్ ఆఫ్ అయిందని బాలిక తల్లి తెలిపారు. కాల్ గురించి పోలీసులకు చెప్పామని, పోలీసులు ఆ నంబర్ లొకేషన్‌ను కనుగొన్నారని బాలిక తల్లి చెప్పారు.
మొబైల్ నంబర్ ఆధారంగా పోలీసులు 12 రోజుల విచారణ తర్వాత నిందితుడిని రోహిత్ అలియాస్ వినోద్‌గా గుర్తించారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ఫిబ్రవరి 9 న బాలికను హత్య చేసి, మృతదేహాన్ని ఘేవ్రా మోర్ సమీపంలో పడవేసినట్లు వెల్లడించాడు. ''నలుగురు సోదరులలో ఆమె ఒక్కరే చెల్లెలు. ఇంట్లో అందరూ ఆమెను చాలా ప్రేమించేవారు'' అని ఆమె తల్లి చెప్పింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తండ్రి డిమాండ్ చేశారు.
ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 9న తన కుమార్తె పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని మృతుడి తల్లి ఫిర్యాదు చేసింది. తమ కుమార్తె అపహరణకు గురైనట్లు బాలిక తల్లిదండ్రులు అనుమానించడంతో ఫిబ్రవరి 10న గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 363 కింద కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. "విచారణ సమయంలో అనుమానిత మొబైల్ నంబర్ కనుగొనబడింది. ఎలక్ట్రానిక్ నిఘా ద్వారా పంజాబ్, మధ్యప్రదేశ్‌లో గాలింపు చేపట్టారు" అని అధికారులు తెలిపారు.
నిందితుడిని ఫిబ్రవరి 21న పట్టుకోగా.. ఫిబ్రవరి 9న బాలికను కలిశానని, ఆమెతో స్నేహం చేశాడని వెల్లడించాడు. "అతను బాలికను ఘేవ్రా మోర్ ప్రాంతంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను చంపి, ఆమె మృతదేహాన్ని పడేశాడు" అని పోలీసులు తెలిపారు. నిందితుడు పోలీసు బృందాన్ని సంఘటనా స్థలానికి తీసుకెళ్లాడు. ముండ్కా గ్రామంలో కుళ్ళిపోయిన బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రైమ్ టీమ్, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాన్ని పిలిపించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.
నిందితుడిని కోర్టులో హాజరుపరిచి తదుపరి విచారణ నిమిత్తం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. బాధితురాలి తల్లి మొబైల్‌లో ‘మిస్డ్‌కాల్’ లేకుంటే కేసును ఛేదించడం కష్టమయ్యేదని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు. ''హత్య యొక్క ఖచ్చితమైన ఉద్దేశ్యం ఇంకా నిర్ధారించబడలేదు. పోస్ట్‌మార్టం నివేదిక బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారించింది'' అని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోంది.