ప్రియుడి కోసం.. తండ్రిని హత్య చేయించిన మైనర్‌ బాలిక.. హైదరబాద్‌లో ఘటన

Girl murder her father with lovers help at kushaiguda. ప్రతి ఆడపిల్ల కూడా తన తండ్రిని రియల్‌ లైఫ్‌ హీరోగా చెప్పుకుంటుంది. చాలా మంది ఆడపిల్లలు తండ్రి బాటలో నడుస్తూ..

By అంజి  Published on  13 Nov 2021 8:02 AM GMT
ప్రియుడి కోసం.. తండ్రిని హత్య చేయించిన మైనర్‌ బాలిక.. హైదరబాద్‌లో ఘటన

ప్రతి ఆడపిల్ల కూడా తన తండ్రిని రియల్‌ లైఫ్‌ హీరోగా చెప్పుకుంటుంది. చాలా మంది ఆడపిల్లలు తండ్రి బాటలో నడుస్తూ.. తండ్రి చెప్పిందే వింటారు. ఆడపిల్లకు తండ్రి అంటే ఎనలేని అభిమానం ఉంటుంది. అయితే ఓ కూతురుకు మాత్రం తన తండ్రి విలన్‌లా కనిపించాడు. వద్దని వారించినందుకు అడ్డు తొలగించుకోవాలనుకుంది. సూపారీ ఇచ్చి తండ్రిని దారుణంగా హత్య చేయించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని కుషాయిగూడలో రామకృష్ణ అనే తండ్రి తన తన కూతురును అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. అయితే కూతురు మాత్రం ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం సాగిస్తోంది. ఇటీవల ఈ విషయం తండ్రికి తెలిసింది. అలాంటివి మానుకోవాలంటూ కూతురిని తండ్రి మందలించాడు. దీంతో బాలిక తన తండ్రిపై కోపం పెంచుకుంది. ప్రియుడితో కలిసి తండ్రిని హత్య చేసేందుకు ప్లాన్‌ గీసింది.

ప్లాన్‌ ప్రకారం తండ్రికి చికెన్‌ కర్రీలో మత్తు పదార్థాలు కలిపి అన్నం పెట్టింది. అది తిన్న తండ్రి వెంటనే స్పృహ కోల్పోయాడు. అనంతరం బాలిక తన ప్రియుడి ఫోన్‌లో సమాచారం అందించింది. ఆ తర్వాత ప్రియుడు సహకారంతో సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కింద పడి చనిపోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. మృతదేహానికి పోస్టు మార్టం చేయగా.. హత్య చేసినట్లుగా తెలిసింది. దీంతో పోలీసులు బాలికను, తన ప్రియుడిని, మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితురాలు మైనర్‌ కావడంతో పోలీసులు ఆమెను జువెనైల్ హోంకు పోలీసులు తరలించారు.

Next Story
Share it