హైదరాబాద్‌లో మరో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం
Girl molested by 5 members in Hyderabad.ఎన్ని కఠిన చట్టాలు ఉన్నప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు.
By తోట వంశీ కుమార్ Published on 7 Jun 2022 11:10 AM ISTఎన్ని కఠిన చట్టాలు ఉన్నప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచార ఘటన మరువక ముందే హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. కార్జానా పరిధిలో బాలికపై ఐదుగురు అత్యాచారానికి పాల్పడగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ధీరజ్, రితేశ్ అనే ఇద్దరు యువకులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బాలికతో పరిచయం పెంచుకున్నారు. ఈ క్రమంలో మంచి వారుగా నటించి బాలిక కు వారి పట్ల సదాభిప్రాయం కలిగే చేశారు. ఈ క్రమంలో ఓరోజు బాలికకు మాయమాటలు చెప్పి బాలికను శారీరకంగా లోబర్చుకున్నారు. ఆ సమయంలో వీడియోలు తీశారు. ఆ తరువాత వీడియోలను అడ్డుపెట్టుకుని పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు.
వీడియోలు ఇస్తామని చెప్పి ఇటీవల బాలికను పిలిచి మరోసారి తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాలిక మానసికంగా కుంగిపోయింది. బాలిక పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు మానసిక వైద్యుడి వద్దకు తీసుకువెళ్లగా.. అసలు విషయం వెలుగు చూసింది. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఓ బాలుడు ఉన్నాడు. బాలుడి మినహా మిగతా వారిపై పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలుడిని జువైనల్ హోంకి తరలించారు.