ప్రియుడితో మాట్లాడుతోందని.. బాలికను చంపిన తల్లి, సోదరుడు

ప్రియుడితో మాట్లాడుతున్నదని ఓ అమ్మాయిని ఆమె తల్లి, సోదరుడు నరికి చంపారు. ఆమెను హత్య చేశారన్న అభియోగంపై

By అంజి  Published on  5 May 2023 3:00 AM GMT
lover Affair, Rajasthan, Crime news

ప్రియుడితో మాట్లాడుతోందని.. బాలికను చంపిన తల్లి, సోదరుడు

ప్రియుడితో మాట్లాడుతున్నదని ఓ అమ్మాయిని ఆమె తల్లి, సోదరుడు నరికి చంపారు. ఆమెను హత్య చేశారన్న అభియోగంపై అజ్మీర్‌లోని శ్రీనగర్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలు సోను ఏప్రిల్ 29న మన్‌పురా అటవీ ప్రాంతంలోని బావిలో శవమై కనిపించిందని, మూడు రోజుల తర్వాత బంధువులు ఫిర్యాదు చేశారు. మొదట్లో, ఆమె కుటుంబ సభ్యులు సామూహిక అత్యాచారం, హత్యకు గురయి ఉంటుందని ఆరోపించారు. అయితే పోలీసులు వారి వాంగ్మూలాలను అనుమానించడం ప్రారంభించారు.

విచారణ సమయంలో

క్షుణ్ణంగా విచారణ, కఠినమైన విచారణ తర్వాత పోలీసులు సోను తల్లి, బాలిక సోదరుడి వాంగ్మూలాలలో విభిన్న విషయాలను వెలికితీశారు. ఇది వారి అరెస్టుకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోను ఓ యువకుడితో ఫోన్‌లో మాట్లాడుతుండేదని, దీంతో ఆమె తల్లి, సోదరుడికి చిరాకు తెప్పించిందని పోలీసులు తెలిపారు. ఆవేశంలో గొడ్డలితో కొట్టి బాలికను చంపేశారు. ఆ తర్వాత హత్యకు సంబంధించిన ఆధారాలను చెరిపేసి బావిలో పడేశారు.

పోలీసులు సోనూ తల్లి శాంతి బేగంను విచారించగా, ఆమె నేరాన్ని అంగీకరించింది.

ఆ యువకుడితో మాట్లాడటం మానేయాలని తన కుమార్తెను పలు మార్లు చెప్పి ప్రయత్నించానని, అయితే ఆమె అంగీకరించలేదని వెల్లడించింది. ఏప్రిల్ 26న మధ్యాహ్నం శాంతి బేగం సోను తలపై గొడ్డలితో కొట్టి చంపింది. అనంతరం కొడుకు హనీఫ్‌తో కలిసి మృతదేహాన్ని బావిలో పడేసి ఇంటికి చేరుకుంది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story