ర్యాగింగ్ పేరుతో ముద్దులు పెట్టేశారు

Girl Forcibly Kissed At Odisha College, 5 Detained For Ragging. పలు చోట్ల ర్యాగింగ్ పేరుతో హద్దులు మీరుతున్న ఘటనలు మనకు షాకింగ్ గా అనిపిస్తూ ఉన్నాయి.

By M.S.R
Published on : 19 Nov 2022 8:00 PM IST

ర్యాగింగ్ పేరుతో ముద్దులు పెట్టేశారు

పలు చోట్ల ర్యాగింగ్ పేరుతో హద్దులు మీరుతున్న ఘటనలు మనకు షాకింగ్ గా అనిపిస్తూ ఉన్నాయి. తాజాగా ఒడిశాలో కూడా ర్యాగింగ్ భూతం బయటకు వచ్చింది. గంజాం జిల్లాలో ఓ మైనర్ యువతి పట్ల అదే కాలేజీకి చెందిన యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు. వీడియోలు వైరల్ కావడంతో అధికారులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

గంజాం జిల్లాలోని స్థానిక ప్రభుత్వ కళాశాలలో మొదటి సంవత్సరం యువతిపై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. పక్కనే కూర్చున్న సీనియర్ ఆదేశాలతో ఓ యువకుడు బలవంతంగా అమ్మాయికి ముద్దు పెట్టాడు. అమ్మాయి వెళ్లిపోవాలని ప్రయత్నించగా.. కర్రతో కొడతామని ఆమెను బెదిరించినట్లు వీడియోలో ఉంది. పక్కనే ఉన్న మరికొంత మంది అమ్మాయిలు కూడా చూస్తూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో కాస్తా వైరల్‌గా మారడంతో అధికారులు చర్యలు దిగారు. మొత్తం 12 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.




Next Story