బ‌ర్త్‌డే పార్టీలో బాలిక‌పై గ్యాంగ్‌ రేప్‌

Girl abused by schoolmates at birthday party. తమిళనాడులోని కడలూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బర్త్‌డే పార్టీ అని ఆహ్వానించి.. బాలికపై ముగ్గురు తోటి విద్యార్థులు

By అంజి  Published on  8 July 2022 5:58 PM IST
బ‌ర్త్‌డే పార్టీలో బాలిక‌పై గ్యాంగ్‌ రేప్‌

తమిళనాడులోని కడలూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బర్త్‌డే పార్టీ అని ఆహ్వానించి.. బాలికపై ముగ్గురు తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు, వారిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. 15 ఏళ్ల బాధిత బాలిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. అదే పాఠశాలలో చదువుతున్న 12వ తరగతి విద్యార్థి బర్త్‌ డే పార్టీకి ఆహ్వానించాడు. ఈ క్రమంలోనే బాలిక బర్త్‌ డే పార్టీకి వెళ్లింది. అక్కడే 10వ తరగతి విద్యార్థి మాట్లాడాలంటూ బాలికను వేరే గదిలోకి తీసుకెళ్లాడు. విద్యార్థి ఆ గదిలోకి తన ఇద్దరు స్నేహితులను పిలిచి డోర్‌ లాక్‌ చేశాడని బాలిక ఆరోపించింది. ఆ తర్వాత ముగ్గురు విద్యార్థులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలికపై జరిగిన ఘటనను వీడియో చిత్రీకరించారు. ఈ వీడియోను అదే స్కూల్‌కు చెందిన విద్యార్థులకు చేరవేశారు.

ఘటన అనంతరం ఇంటికి వెళ్లిన బాలిక తిరిగి పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో తల్లి ప్రశ్నించడంతో జరిగిన విషయాన్ని బాలిక చెప్పింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే బాలిక తల్లి సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రీజనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా బాలికను విచారించి కేసు నమోదు చేశారు. అనంతరం ముగ్గురు విద్యార్థులను పోక్సో చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు.

Next Story