Telangana: 3 ఏళ్ల బాలికపై అత్యాచారం.. చాక్లెట్లు ఇస్తానని గదిలోకి తీసుకెళ్లి..

తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో మూడేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు బుధవారం తెలిపారు.

By అంజి  Published on  22 Aug 2024 7:10 AM IST
Telangana, Siddipet, Crime

Telangana: 3 ఏళ్ల బాలికపై అత్యాచారం.. చాక్లెట్లు ఇస్తానని గదిలోకి తీసుకెళ్లి..

తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో మూడేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు బుధవారం తెలిపారు. నిందితుడు అజయ్‌ని అరెస్టు చేశారు. ఆగస్టు 19వ తేదీ సోమవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజయ్ బాలిక నివాసముంటున్న గృహ సముదాయంలో పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. చిన్నారికి చాక్లెట్లు ఇప్పిస్తానని రప్పించి తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న బాలిక తాత జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరుసటి రోజు అజయ్‌ని అరెస్టు చేశారు.

బాలిక సిద్దిపేటలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విచారణ పూర్తి చేసి త్వరగా చార్జిషీట్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ తెలిపారు. అధికారులు కూడా త్వరగా విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు కోరారు. సిద్దిపేట జిల్లాలో మూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిని మంగళవారం అరెస్టు చేశారు. అజయ్ అనే నిందితుడు బాలిక నివసించే అదే గృహ సముదాయంలో పెయింటర్‌గా పని చేశాడు.

Next Story