13 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు గ్యాంగ్‌రేప్‌.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

కర్ణాటకలోని హుబ్బళ్లిలో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికపై 14 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు గల ముగ్గురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు శనివారం తెలిపారు.

By -  అంజి
Published on : 4 Jan 2026 12:22 PM IST

3 Minors, Karnataka, Hubballi, Crime

13 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు గ్యాంగ్‌రేప్‌.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

కర్ణాటకలోని హుబ్బళ్లిలో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికపై 14 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు గల ముగ్గురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు శనివారం తెలిపారు. బాలిక తల్లిదండ్రులు లేనప్పుడు, అదే ప్రాంతంలో నివసించే అబ్బాయిలు ఆమెను ఒక నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. 13 సంవత్సరాల వయస్సు గల బాధిత బాలికకు రక్షణ కల్పించామని, ముగ్గురు అబ్బాయిలను అదుపులోకి తీసుకున్నామని హుబ్బళ్లి-ధార్వాడ్ పోలీసు కమిషనర్ ఎన్ శశి కుమార్ తెలిపారు.

"వారిలో ఇద్దరు ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు. మరొక బాలుడు.. ప్రస్తుతం మాకు ఉన్న సమాచారం ప్రకారం, పాఠశాల మానేసినట్లు కనిపిస్తోంది" అని శశి కుమార్ చెప్పారు. "ఆ ఘటనకు సంబంధించిన వీడియో తమ వద్ద ఉందని అబ్బాయిలు బాలికను బెదిరించారని బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నిందితుల మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని అవసరమైన దర్యాప్తు చేపడతాము" అని ఆయన తెలిపారు.

Next Story