భార్యను గొంతు కోసి చంపిన భర్త

ఘజియాబాద్‌లో తన భార్యను గొంతు కోసి చంపినందుకు 55 ఏళ్ల వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

By అంజి  Published on  4 March 2024 6:18 AM IST
Ghaziabad, man kills wife, Crime news

భార్యను చంపిన భర్త.. 4 రోజులు ఆ మృతదేహాంతో.. 

ఘజియాబాద్‌లో తన భార్యను గొంతు కోసి, ఆమె మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు అతడి నివాసంలో ఉంచుకున్నందుకు 55 ఏళ్ల వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు భరత్ సింగ్ మద్యం మత్తులో జరిగిన విషయాన్ని ఇరుగుపొరుగు వారితో చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. తర్వాత వారి అపార్ట్‌మెంట్‌ నుంచి దుర్వాసన రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మృతదేహం పరిస్థితి చూస్తే చనిపోయి 3 నుంచి 4 రోజుల వయస్సు ఉంటుందని పోలీసులు తెలిపారు. వారి బెడ్‌రూమ్‌లో మహిళ మృతదేహం లభ్యమైంది. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా ఇంటి గొడవల కారణంగా తన 51 ఏళ్ల భార్య సునీతను హత్య చేసినట్లు అంగీకరించాడు. మహిళ శరీరం కుళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మూడు సంవత్సరాల క్రితం సునీతతో తనకు పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత తాము సహజీవనం ప్రారంభించామని పోలీసుల విచారణలో భరత్ వెల్లడించాడు.

సునీత మొదటి భర్త 2012లో చనిపోగా భరత్ విడాకులు తీసుకున్నాడు. ఏడాది క్రితం వీరికి పెళ్లయింది. అయితే ఇటీవల భరత్ రెండో పెళ్లి గురించి తెలుసుకున్న భరత్ మొదటి భార్య అతడిని డబ్బులు డిమాండ్ చేయడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఫిబ్రవరి 28న భరత్ మద్యం మత్తులో రెండో భార్యను గొంతుకోసి హత్య చేశాడు. భరత్ ఓ మద్యం దుకాణంలో సేల్స్‌పర్సన్‌గా పనిచేసేవాడు. మహిళ కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. భరత్‌ను 10 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Next Story