ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై అత్యాచారయత్నం.. గ్యాస్ డెలివరీ బాయ్‌ని చితకబాదిన స్థానికులు

Gas delivery man thrashed by locals for molesting minor girl alone at home. ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడినందుకు గ్యాస్ డెలివరీ బాయ్‌ను స్థానికులు చితకబాదారు.

By అంజి  Published on  4 Feb 2022 3:22 AM GMT
ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై అత్యాచారయత్నం.. గ్యాస్ డెలివరీ బాయ్‌ని చితకబాదిన స్థానికులు

మహిళలు, బాలికలు ఒంటరిగా కనిపించడమే పాపమైంది. ఒంటరిగా కనిపిస్తే చాలు మహిళలపై కామాంధులు దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడినందుకు గ్యాస్ డెలివరీ బాయ్‌ను స్థానికులు చితకబాదారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని బరాసత్‌లోని గురువారం నాడు జరిగింది. 16 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి వచ్చి ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.

మైనర్ బాలిక సహాయం కోసం కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసింది. నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని కొట్టారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. దీనిపై బరాసత్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

Next Story