శ్రీకాకుళం జిల్లాలో వైస్ ఎంపీపీ దారుణ హ‌త్య‌

Gara Vice MPP Rama Seshu murdered.వైసీపీ నేత హత్య శ్రీకాకుళం జిల్లాలో క‌ల‌క‌లం రేపింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Dec 2022 12:54 PM IST
శ్రీకాకుళం జిల్లాలో వైస్ ఎంపీపీ దారుణ హ‌త్య‌

వైసీపీ నేత హత్య శ్రీకాకుళం జిల్లాలో క‌ల‌క‌లం రేపింది. గార్ల మండ‌ల వైస్ ఎంపీపీ రామ‌శేషు దారుణ హ‌త్య‌కు గురైయ్యారు. శ్రీకూర్మంలోని త‌న గ్యాస్ గొడౌన్ వ‌ద్ద‌కు వెలుతున్న క్ర‌మంలో దుండ‌గులు ఆయ‌న్ను హ‌త‌మార్చారు. ముగ్గురు దుండ‌గులు బైక్‌పై వ‌చ్చి ఆయ‌న్ను హ‌త్య చేసిన‌ట్లు తెలుస్తోంది. తీవ్ర‌గాయాల‌తో ఘ‌ట‌నాస్థ‌లంలోనే ఆయ‌న మృతి చెందారు. ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్న ఆయ‌న మృత‌దేహాన్ని గుర్తించిన గ్రామ‌స్తులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

రామశేషు హార్డ్‌వేర్‌, సిమెంట్, ఎరువులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. గ్రామంలో మూడు సార్లు స‌ర్పంచ్‌గా కూడా ప‌ని చేశారు. ఆరేళ్ల క్రితం కూడా రామ‌శేషుపై దాడి చేశారు. ఆ స‌మ‌యంలో తీవ్ర‌గాయాలు అయిన‌ప్ప‌టికీ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే.. ఇప్పుడు దారుణ హ‌త్య‌కు గురైయ్యారు.

Next Story