హైదరాబాద్‌లో ఫేక్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

నార్సింగిలో నకిలీ విద్యా సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న గ్యాంగ్‌ను నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

By -  Knakam Karthik
Published on : 24 Nov 2025 8:40 AM IST

Crime News, Hyderabad, Narsingi Police, Fake Certificates

హైదరాబాద్‌లో ఫేక్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్: నార్సింగిలో నకిలీ విద్యా సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న గ్యాంగ్‌ను నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నార్సింగి చింత చెట్టు ప్రాంతంలో పహారా ఏర్పాటు చేసి, నకిలీ సర్టిఫికెట్లను కస్టమర్లకు ఇవ్వడానికి వచ్చిన ఐదుగురు వ్యక్తులను పట్టుకున్నారు. ఆ సమయంలో వారి వద్ద నుండి SRM యూనివర్శిటీ, బెంగుళూరు సిటీ యూనివర్శిటీ పేర్లతో ఉన్న నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, మెమోలు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు, బోనాఫైడ్ సర్టిఫికెట్లు మరియు ఇతర నకిలీ రికార్డులు స్వాధీనం చేయబడ్డాయి. నకిలీ సర్టిఫికెట్ల తయారీ, ముద్రణ, విక్రయం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం...మీర్జా అక్తర్ అలీ బైగ్ అలియాస్ అస్లాం- ప్రధాన నిందితుడు, మహ్మద్ అజాజ్ అహ్మద్, - వడ్డేపల్లి వెంకట్ సాయి, విస్టాలా రోహిత్ కుమార్, సత్తూరి ప్రవీణ్‌ని అరెస్టు చేశారు. వెంకట్, రోహిత్, ప్రవీణ్ - నకిలీ బి.టెక్ సర్టిఫికెట్‌ను కొనుగోలు చేశారు. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు నార్సింగి పోలీసులకు సమాచారం రావడంతో నార్సింగిలోని చింతచెట్టు ప్రాంతంలో నకిలీ సర్టిఫికేట్లు అవసరం ఉన్న వారికి ఇచ్చేందుకు వచ్చిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ, బెంగుళూరు సిటీ యూనివర్శిటీ పేర్లతో ఉన్న నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, మెమోలు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు, బోనాఫైడ్ సర్టిఫికెట్లు, ఇతర నకిలీ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. సులభంగా డబ్బులు సంపాదించేందుకే నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించింది.

Next Story