విజయవాడలో మహిళపై గ్యాంగ్‌రేప్‌.. 3 రోజుల పాటు రూమ్‌లో బంధించి..

Gang rape of woman in Vijayawada. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, నేరాలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి.

By అంజి
Published on : 20 Dec 2022 11:03 AM IST

విజయవాడలో మహిళపై గ్యాంగ్‌రేప్‌.. 3 రోజుల పాటు రూమ్‌లో బంధించి..

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, నేరాలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. తాజాగా ఏపీలోని విజయవాడలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళను గదిలో బంధించి మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు వ్యక్తులు. సోమవారం నాడు రాత్రి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల అఘాయిత్యంతో బాధితురాలు తీవ్ర అనారోగ్యం పాలైంది. ప్రస్తుతం విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడలోని బెంజి సర్కిల్‌ దగ్గర ఓ మహిళ కూలి పనులు చేసుకుని బతుకుతోంది.

ఈ క్రమంలోనే డిసెంబర్‌ 17వ తేదీన అదే ప్రాంతంలోని సులభ్‌ కాంప్లెక్స్‌లో పని చేస్తున్న వ్యక్తి మహిళను నమ్మించి కానూర్‌ సనత్‌నగర్‌లోని ఓ రూమ్‌కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత అక్కడికి అతడి ముగ్గురు స్నేహితులు వచ్చారు. మద్యం మత్తులో మహిళపై 3 రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం నాడు బాధితురాలు తీవ్ర అస్వస్థతతో ప్రభుత్వాసుపత్రిలో చేరింది. దీంతో ఈ అఘాయిత్యం బయటపడింది. ఆస్పత్రి సిబ్బంది సమాచారం పెనమలూరు పోలీసులు సదరు బాధితురాలితో మాట్లాడారు. నిన్న రాత్రి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Next Story