21 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్.. ముగ్గురు అరెస్ట్
మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో దారుణం జరిగింది. 21 ఏళ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By - అంజి |
21 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్.. ముగ్గురు అరెస్ట్
మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో దారుణం జరిగింది. 21 ఏళ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి తన స్నేహితుడితో ఇంటి నుండి బయలుదేరిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. మనస్తాపానికి గురైన బాధితురాలు తపతి నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించింది. కానీ లోతులేని నీటిలో పడి, వెన్ను విరిగి ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటోంది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఆ మహిళతో స్నేహం చేసిన ప్రధాన నిందితుడు శంభు నవ్డే (25), శంభుతో కలిసి ఆమెపై అత్యాచారం చేసిన పంకజ్ ఉయ్కే (24), ప్రధాన నిందితుడితో కలిసి వెళ్లి తర్వాత వెళ్లిపోయిన రావత్ ఉయ్కే (22)లను పోలీసులు అరెస్ట్ చేశారు.
"ఆ మహిళ శంబుతో స్నేహం చేసింది. వారు ఫోన్ ద్వారా తరచుగా సంప్రదింపులు జరుపుకున్నారు. జనవరి 3 రాత్రి, ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో, ఆ యువకుడు తన స్నేహితుడు రావత్ ఉయ్కేతో వచ్చి తనతో రావాలని కోరాడు. అతనిని నమ్మి, ఆ మహిళ తన వస్తువులను సర్దుకుని ఇంటి నుండి వెళ్లిపోయింది." "కొంత దూరం ప్రయాణించిన తర్వాత, యువకుడితో పాటు వచ్చిన స్నేహితుడు వారిని విడిచిపెట్టాడు. శంభు మరొక వ్యక్తి పంకజ్ ఉయ్కేను సంప్రదించాడు, ఆ తర్వాత ఆ మహిళను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ, మొదట శంబు, తరువాత పంకజ్ ఆమెపై అత్యాచారం చేశారు" అని బాధితురాలి ఫిర్యాదును ప్రస్తావిస్తూ పోలీసులు చెప్పారు.
"దాడి తర్వాత, ఇద్దరు వ్యక్తులు ఆ మహిళను అడవిలో ఒంటరిగా వదిలి పారిపోయారు. షాక్, నిరాశతో యువకుడు తన కోసం తిరిగి వస్తాడని నమ్మి ఆమె రాత్రంతా వేచి ఉంది. అతను తిరిగి రాకపోవడం జనవరి 4న తెల్లవారుజామున తవా నదిలో దూకి తన జీవితాన్ని ముగించుకోవడానికి ప్రయత్నించింది" అని పోలీసు అధికారి దహత్ చెప్పారు. "ఆమె ప్రాణాలతో బయటపడింది కానీ ఆమె నడుముకు తీవ్రమైన పగులు వచ్చింది. ప్రస్తుతం చికిత్స పొందుతోంది" అని తెలిపారు. "ఆ మహిళ తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. జనవరి 5న మాకు అక్కడి నుండి సమాచారం అందింది. కేసు నమోదు చేసి హైదరాబాద్‌కు పారిపోవాలని ప్లాన్ చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు, కోర్టు వారిని జైలుకు పంపింది" అని ఆమె చెప్పారు.