ఆ ముగ్గురు గణేష్ విగ్రహం చోరీ చేశారా..?

Ganesh idol stolen in Hyderabad. గణేష్ విగ్రహాల ముందు ‘ప్రసాదం’గా ఉంచిన లడ్డూలను దొంగిలించడం

By Medi Samrat  Published on  30 Aug 2022 8:15 PM IST
ఆ ముగ్గురు గణేష్ విగ్రహం చోరీ చేశారా..?

గణేష్ విగ్రహాల ముందు 'ప్రసాదం'గా ఉంచిన లడ్డూలను దొంగిలించడం హైదరాబాద్‌లో కొత్తేమీ కాదు. అయితే గణేష్ విగ్రహమే చోరీకి గురికావడం కొత్త విషయం. సోమవారం అర్థరాత్రి హయత్‌నగర్‌లో అదే జరిగింది. ముగ్గురు వ్యక్తులు రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో అమ్మకానికి ఉంచిన గణేష్ విగ్రహాన్ని ఎత్తుకుని వెళ్లిపోయారు. మంగళవారం వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ అయింది.

ముగ్గురు గుర్తుతెలియని యువకులు రోడ్డుకు ఒక వైపున ఉన్న స్టాల్ నుండి విగ్రహాన్ని ఎత్తడం.. ఆపై ట్రాఫిక్‌లో ప్రశాంతంగా రోడ్డు మీదుగా తీసుకువెళ్లడం.. ఆపై ఆటో ట్రాలీలో అక్కడి నుంచి పారిపోవ‌డం సీసీ కెమెరా దృశ్యాల‌లో రికార్డ‌య్యింది. అయితే వారు విగ్రహం పెట్టుకోలేని కారణంగా తీసుకెళ్లారా.. లేక అమ్మి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై తమకు సమాచారం అందినప్పటికీ అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని హయత్‌నగర్ పోలీసులు తెలిపారు.


Next Story