పబ్జీలో అమ్మాయికి అబ్బాయి పరిచయం.. ఆ తర్వాత టార్చర్ చూపించాడు
Friendship through PUBG then 'Blackmailed' to have 'Physical Relationship. బీహార్‌లోని పాట్నాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
By M.S.R Published on 1 Feb 2022 12:47 PM ISTబీహార్‌లోని పాట్నాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫుల్వారీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ బాలిక నాలుగేళ్లుగా తనను ఓ వ్యక్తి బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ఆన్‌లైన్ గేమర్ అని తెలుస్తోంది. యువతులను అసభ్యకర వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసేవాడు. ధనౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూపస్‌పూర్‌లో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి పేరు హృతిక్ రాజ్. నిందితుడి ఫోన్‌లో 100కు పైగా అశ్లీల వీడియోలు ఉన్నాయి. బాలికలను బ్లాక్ మెయిల్ చేసేవాడు. అదే సమయంలో అతడి నుంచి మత్తు పదార్థాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
ఆన్‌లైన్ గేమ్ PUBG ద్వారా బాలిక యువకుడితో పరిచయమైందని సబ్ ఇన్‌స్పెక్టర్ రోషన్ కుమార్ సింగ్ తెలిపారు. మొదట తన ఫొటో తీసి బ్లాక్‌మెయిల్ చేశాడని బాలిక తెలిపింది. అనంతరం ఆమెను లైంగికంగా వేధించాడు. ఆ యువతిపై పలు అసభ్యకర వీడియోలు కూడా తయారు చేశాడు. హృతిక్ తన ఫోన్‌ను కూడా హ్యాక్ చేశాడని బాలిక తెలిపింది. ఆమె పేరుతో ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా క్రియేట్ చేసి.. బాలికపై అసభ్యకర వీడియో పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నాడు. ఆ అమ్మాయితో డబ్బులు కూడా డిమాండ్ చేశాడు. అమ్మాయి పేరు మీద హోటల్ బుక్ చేసి అక్కడ కూడా ఆమెతో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అతడి టార్చర్ భరించలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని విచారించారు. తాను చేసిన వాటిని అంగీకరించాడు. ఇంకా చాలా మంది యువతులను అతడి వేధించినట్లు గుర్తించారు.