తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని ఒక కొండపైకి ఒక విదేశీ జాతీయురాలిని తీసుకెళ్లి, ఆమెను ఒక టూరిస్ట్ గైడ్ లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. ఫ్రాన్స్‌కు చెందిన 46 ఏళ్ల మహిళ 2025 జనవరిలో తిరువణ్ణామలైకి చేరుకుని ఒక ప్రైవేట్ ఆశ్రమంలో నివసిస్తోంది. గత సంవత్సరం కొండచరియలు విరిగిపడిన తర్వాత దీపమలై కొండపైకి ప్రజలను ఎక్కనివ్వకుండా నిషేధించారు. అయితే ఆమె గైడ్ల బృందంతో కలిసి 2,668 అడుగుల ఎత్తైన కొండను ఎక్కింది.
ఆమె ధ్యానం చేయడానికి ఒక గుహలోకి ప్రవేశించినప్పుడు, వెంకటేశన్ అనే టూరిస్ట్ గైడ్ ఆమెపై లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. ఆ మహిళ తప్పించుకుని కొండ దిగి తిరువణ్ణామలై వెస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వెంకటేశన్ ను అరెస్టు చేశారు. ఫ్రెంచ్ మహిళ చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. తదుపరి దర్యాప్తులు కొనసాగుతున్నాయి.
ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన తిరువణ్ణామలై.. అన్నామలైయర్ ఆలయం, రమణ మహర్షి ఆశ్రమంతో సహా 14 పవిత్ర స్థలాలకు నిలయం. ఎంతో మంది విదేశీయులు ఇక్కడికి వస్తూ ఉంటారు.