Hyderabad: మైనర్‌ బాలికపై అత్యాచారం.. నలుగురు యువకులకు జైలు శిక్ష

ఛత్రినాకలో 2023లో నమోదైన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నలుగురు యువకులకు బాల నేరాల ప్రత్యేక న్యాయస్థానం కఠిన కారాగార శిక్ష విధించింది.

By అంజి  Published on  25 Jan 2025 11:33 AM IST
Four youths jailed, minor girl , Hyderabad, Crime

Hyderabad: మైనర్‌ బాలికపై అత్యాచారం.. నలుగురు యువకులకు జైలు శిక్ష

హైదరాబాద్: ఛత్రినాకలో 2023లో నమోదైన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నలుగురు యువకులకు బాల నేరాల ప్రత్యేక న్యాయస్థానం కఠిన కారాగార శిక్ష విధించింది. మరో వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్రినాక ఆల్విన్‌ కాలనీకి చెందిన ఎం రాహుల్ (21), గౌలిపురాకు చెందిన ఎం నితిన్ (19)లకు 25 ఏళ్ల జైలు శిక్ష, బోయగూడకు చెందిన జి దీక్షిత్, శివగంగా నగర్‌కు చెందిన డి మల్లేష్‌లకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. వీరు నలుగురు ఓ బాలికకు మాయ మాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు రో వ్యక్తి (ఏ5) కలిసి ఓ బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనపై ఛత్రినాక పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పించారు. దీంతో నాంపల్లి కోర్టు శుక్రవారం నాడు తీర్పు వెలువరించింది. ఏ1, ఏ2కు 25 ఏండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా, ఏ3, ఏ4కు ఐదేండ్ల జైలు శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధించింది. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న గంగానగర్​కు చెందిన రాజ్ కుమార్​ను నిర్దోషిగా విడుదల చేసింది. బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించడమే కాకుండా వారికి రూ.2000 నుంచి రూ.10,000 వరకు జరిమానా విధించింది.

Next Story