దారుణం.. నలుగురు కుటుంబ సభ్యులను చంపిన యువకుడు
Four of family hacked to death in Palam.ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. నలుగురు కుటుంబ సభ్యులను హతమార్చాడు.
By తోట వంశీ కుమార్
ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. నలుగురు కుటుంబ సభ్యులను హతమార్చాడు. మృతుల్లో అతడి తండ్రి, ఇద్దరు సోదరిమణులు, నానమ్మ ఉన్నారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.
ఢిల్లీలోని పాలమ్ ప్రాంతంలో ఓ యువకుడు తన తండ్రి, ఇద్దరు సోదరిమణులు, నానమ్మతో కలిసి నివసిస్తున్నాడు. మదకద్రవ్యాలకు అతడు బానిసగా మారాడు. మంగళవారం రాత్రి ఏం జరిగిందో తెలీదు గానీ.. నలుగురు కుటుంబసభ్యులను కత్తితో అతి దారుణంగా హతమార్చాడు. రక్తపు మడుగులో పడిఉన్న మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మృతిచెందిన ముగ్గురు మహిళల్లో ఒకరు ఇంటి గ్రౌండ్ ఫోర్‌పై పడి ఉండగా, మరో రెండు మృతదేహాలను బాత్‌రూమ్‌లో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. "నవంబర్ 22 రాత్రి 10:30 గంటల సమయంలో పిఎస్ పాలెమ్ నుంచి కాల్ వచ్చింది. వెంటనే అక్కడకు వెళ్లాం. ఒక ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు శవమై కనిపించారు. తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న నిందితుడిని అతని బంధువులు పట్టుకున్నారని అప్పగించారు. నలుగురిని కత్తితో పొడిచి చంపేశాడు." అని పోలీసులు తెలిపారు.
ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి స్థిరమైన ఉద్యోగం లేకపోవడంతో కుటుంబ సభ్యుల మధ్య గొడవలే నేరానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.