నవంబర్ 25 గురువారం నాడు ప్రయాగ్‌రాజ్‌లోని ఫఫమౌ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. నలుగురినీ పదునైన ఆయుధంతో నరికి చంపారు. మృతుల్లో ఫూల్‌చంద్, అతని భార్య మీను, కుమార్తె సప్న, కుమారుడు శివ ఉన్నారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందంతో ఘటనా స్థలానికి చేరుకుని నమూనాలు సేకరించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఒక గదిలో మూడు మృతదేహాలు, మరో గదిలో బాలిక మృతదేహం ఉన్నట్లు ఎస్‌ఎస్పీ ప్రయాగ్‌రాజ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. కుటుంబ సభ్యులందరినీ తలపై వేటు వేసి హతమార్చినట్లు తెలుస్తోందని అన్నారు. సుశీల్ కుమార్ అనే వ్యక్తితో ఆస్తి తగాదాల కారణంగానే ఈ హత్య జరిగిందని, గతంలో కూడా తమపై పలుమార్లు దాడి చేశారని మృతుడి ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు.

ఈ హత్య బుధవారం అర్థరాత్రి ఫఫమౌ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్‌గంజ్ ఫుల్వారియా గోహ్రీ గ్రామంలో జరిగింది. బాధితులను ఫుల్‌చంద్ (50), అతని భార్య మిను దేవి (45), కుమార్తె సప్న (17), కుమారుడు శివ్ (10) గా గుర్తించారు. వేర్వేరు మంచాలపై మృతదేహాలన్నింటినీ ఉంచారు. ఈ ఉదయం హత్యలకు సంబంధించిన సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story