స్టీల్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

four injured in blast at Ludhiana steel factory. పంజాబ్‌లోని లుథియానా జిల్లాలో ఉన్న ఒక స్టీల్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు సంభ‌వించింది.

By M.S.R  Published on  20 Dec 2022 8:06 PM IST
స్టీల్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

పంజాబ్‌లోని లుథియానా జిల్లాలో ఉన్న ఒక స్టీల్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు సంభ‌వించింది. దొర‌హ ప‌ట్ట‌ణంలో రాంపూర్ రోడ్డుకు ఉన్న గ్రేట్ ఇండియ‌న్ స్టీల్ కంపెనీలో శ‌నివారం బాయిల‌ర్ పేలింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. న‌లుగురికి తీవ్ర‌ గాయాల‌య్యాయి. ఇద్దరు కార్మికులను సమీపంలోని సిద్ధూ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వారు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మిగిలిన వారికి చికిత్స అందిస్తూ ఉన్నారు.

ఆరుగురు కార్మికులు ఉన్న ఫ్యాక్టరీ గ్యాస్‌ఫికేషన్ యూనిట్‌లోని బాయిలర్‌లో శనివారం ఉదయం పేలుడు సంభవించిందని డీఎస్పీ (పాయల్) హర్సిమ్రత్ సింగ్ తెలిపారు. వినయ్ సింగ్, రాహుల్ కుమార్ అక్కడికక్కడే మరణించారు. ఇద్దరూ బాయిలర్ దగ్గర నిలబడి ఉన్నారు. వినయ్ బాయిలర్‌లో కలప దుంగలు వేస్తుండగా, రాహుల్ మెయింటెనెన్స్ డ్యూటీలో ఉన్నాడని DSP తెలిపారు. అనంతరం వారి మృతదేహాలను లూథియానాలోని ఎస్పీఎస్‌ ఆస్పత్రికి తరలించారు. "యూనిట్ యజమానుల నిర్లక్ష్యం గురించి మేము తనిఖీ చేస్తున్నాము. ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నాం'' అని డీఎస్పీ తెలిపారు. గాయపడిన వారిని రమేష్ కుమార్, ఆశిష్, అనిల్ కుమార్, బాబు రామ్ మిశ్రాగా గుర్తించారు. గాయపడిన నలుగురు దొరహాలోని సిద్ధూ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.


Next Story