టవల్‌తో కట్టేసి వివాహిత‌పై సామూహిక అత్యాచారం

Four held for gang raping 22 year old woman. ఒడిషా రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహితపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు

By అంజి  Published on  15 Nov 2021 10:40 AM GMT
టవల్‌తో కట్టేసి వివాహిత‌పై సామూహిక అత్యాచారం

ఒడిషా రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహితపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన పూరి జిల్లా నిమపరలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి వివాహిత (22) కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లింది. ఈ క్రమంలోనే పక్కనే కాలువ వద్ద ఉన్న పొరుగు గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆమెపై అత్యచారానికి పాల్పడ్డారు. వివాహిత ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో భర్త, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే ఆమె కోసం గాలించగా.. కాలువ వద్ద ఏడుస్తూ మహిళ కనిపించింది. జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను గుర్తించారు.

నిందితులు బలరాం భాయ్‌ అలియాస్‌ బలియా, కన్హేభాయ్‌, విద్యాధర్‌ స్వామియన్‌, అజిత్‌ దాస్‌లను పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం రాత్రి నిమపారాలోని కాలకృత్యాలు తీర్చుకునేందుకు కాలువ ఒడ్డుకు వెళ్లిన వివాహితపై నలుగురు వ్యక్తులు టవల్‌తో కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డారని పూరీ ఎస్పీ కన్వర్ విశాల్ సింగ్ తెలిపారు. బాధితురాలికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అని ఎస్పీ తెలిపారు. నిందితులు కాకత్‌పూర్ ప్రాంతానికి చెందినవారని, నిమపారా మార్కెట్‌లో వేర్వేరు దుకాణాల్లో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.

Next Story
Share it