ప్రియుడి ఇంటికి ఒకేసారి నలుగురు ప్రియురాళ్లు.. ఆ తర్వాత గదిలోకి వెళ్లి

Four girlfriends who got in the car in front of the house at once, a disgusted boyfriend. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఓ యువకుడు ఒకే సమయంలో నలుగురు

By అంజి  Published on  13 Nov 2021 11:50 AM IST
ప్రియుడి ఇంటికి ఒకేసారి నలుగురు ప్రియురాళ్లు.. ఆ తర్వాత గదిలోకి వెళ్లి

పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఓ యువకుడు ఒకే సమయంలో నలుగురు అమ్మాయిలతో ప్రేమ వ్యవహారం నడిపాడు. కానీ ఒకరోజు నలుగురు స్నేహితురాళ్ళు ఒకేసారి అతని ఇంటికి వచ్చారు. దీంతో ఆ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఓ దిన పత్రిక కథనం ప్రకారం.. ఆ యువకుడు కూచ్ బెహార్‌లోని జోర్పాట్కి గ్రామంలోని స్థానిక మెడికల్ స్టోర్‌లో పనిచేస్తున్నాడు. యువకుడు నలుగురు అమ్మాయిలతో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే యువకుడు చేస్తున్న మోసం నలుగురు అమ్మాయిలకు తెలిసింది. దీంతో సమాచారం అందుకున్న నలుగురూ ఒకరినొకరు సంప్రదించి యువకుడి ఇంటికి చేరుకున్నారు.

యువకుడి ఇంటి బయట నలుగురు అమ్మాయిలు కలసి వీరంగం సృష్టించారు. యువకుడు సభమోయ్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో వారికి ఆ యువకుడు సమాధానం చెప్పలేకపోయాడు. గదిలోకి వెళ్లి విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా నలుగురు అమ్మాయిలు ఈ కేసులో ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అందుకే పోలీసులు ఇప్పటికీ దాని గురించి ఏమీ మాట్లాడేలేదు. యువకుడి కుటుంబం కూడా మీడియా కెమెరాలకు దూరంగా ఉంది. ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడని, అయితే అతని పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Next Story