జాబ్ లేద‌ని 4వ అంతస్తు నుంచి దూకి ఎయిర్ హోస్టెస్ ఆత్మ‌హ‌త్య‌

Flight attendant commits suicide over lack of job.కోల్‌కతాకు చెందిన 27 ఏళ్ల‌ ఎయిర్ హోస్టెస్ ఉపాధి లేకపోవడంతో

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 22 Jan 2023 3:01 PM IST

జాబ్ లేద‌ని 4వ అంతస్తు నుంచి దూకి ఎయిర్ హోస్టెస్ ఆత్మ‌హ‌త్య‌

కోల్‌కతాకు చెందిన 27 ఏళ్ల‌ ఎయిర్ హోస్టెస్ ఉపాధి లేకపోవడంతో శనివారం భవనంలోని నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రగతి మైదాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్రోపాలిటన్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో దేబోప్రియ బిస్వాస్ నివాసం ఉంటోంది. ఆమె ఎయిర్ హోస్టెస్ గా ప‌ని చేస్తుండేది. గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా ఆమెకు స‌రైన జాబ్ లేక‌పోవ‌డంతో డిప్రెషన్, మానసిక సమస్యలతో బాధ‌ప‌డుతుందని ఆమె కుటుంబ స‌భ్యులు తెలిపారు.

ఈ క్ర‌మంలో బిశ్వాస్ శ‌నివారం సాయంత్రం 4 గంటలకు తన సోదరి నివాసముంటున్న నాలుగు అంతస్తుల భవనంపై నుంచి కింద‌కు దూకడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను ఎస్‌ఎస్‌కెఎం మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఈ ఘటనపై ఆసుపత్రి అధికారులు పోలీసులకు సమాచారం అందించగా, స్థానిక పోలీస్‌స్టేషన్‌ బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనుమానాస్ప‌ద మ‌ర‌ణంగా కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story