Hyderabad: ఐదేళ్ల బాలికపై వలస కూలీ అత్యాచారం, హత్య
హైదరాబాద్ శివార్లలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. బీహార్‌కు చెందిన 60 ఏళ్ల వలస కూలీని ఈ దారుణమైన నేరానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 19 Oct 2023 12:51 AM GMTHyderabad: ఐదేళ్ల బాలికపై వలస కూలీ అత్యాచారం, హత్య
హైదరాబాద్ శివార్లలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. బీహార్‌కు చెందిన 60 ఏళ్ల వలస కూలీని ఈ దారుణమైన నేరానికి అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. హైదరాబాద్ సమీపంలోని సంగారెడ్డి జిల్లా భానూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు బాలికను ప్రలోభపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఏడుపు ప్రారంభించడంతో, అతను ఆమెను హత్య చేశాడు. సోమవారం రాత్రి బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పత్తి పొలాల్లో బాలిక మృతదేహం లభ్యమైంది.
బాలికకు శీతల పానీయం ఇస్తానని నిందితుడు ప్రలోభపెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. పత్తి పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. బాధితురాలు తన తల్లిదండ్రులు, తాతయ్యలతో కలిసి నిర్మాణ స్థలంలో ఉంటున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. ఆమె తల్లిదండ్రులు ఇటీవల వారి స్వగ్రామానికి వెళ్లారు, వారి కుమార్తెను ఆమె తాతయ్య దగ్గర ఉంచారు. తాతయ్య సోమవారం పని నిమిత్తం వెళ్లి, చిన్నారిని ఆ స్థలంలో వదిలిపెట్టాడు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఆమె కనిపించకుండా పోయింది.
నిర్మాణ స్థలంలో ఉన్న వాచ్మెన్, వలస కూలీతో అమ్మాయిని చూశానని చెప్పాడు. వాచ్మెన్, ఇతర కార్మికులు అనుమానితుడిని గుర్తించి అతడిని చితక్కొట్టారు. వారు పోలీసులకు సమాచారం అందించగా నిందితుడు నేరం అంగీకరించాడు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376, 302, పోక్సో చట్టం, జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.