Vijayawada: వైద్యుడు సహా ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి

విజయవాడ నగరంలో ఓ ఫ్యామిలీ సూసైడ్‌ ఘటన కలకలం రేపింది. పటమట ప్రాంతంలోని గురునానక్ నగర్‌లో నివాసం ఉంటున్న ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు.

By అంజి
Published on : 30 April 2024 2:28 PM IST

vijayawada, doctor, Crime news, Andhrapradesh

Vijayawada: వైద్యుడు సహా ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి

విజయవాడ నగరంలో ఓ ఫ్యామిలీ సూసైడ్‌ ఘటన కలకలం రేపింది. పటమట ప్రాంతంలోని గురునానక్ నగర్‌లో నివాసం ఉంటున్న ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. స్థానికంగా నివాసముంటున్న ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు డి.శ్రీనివాస్‌ (40)తో పాటు ఆయన భార్య ఉష (38) , ఇద్దరు పిల్లలు శైలజ (9), శ్రీహన్‌ (8), తల్లి రమణమ్మ (65) ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం నాడు ఉదయం పని మనిషి ఇంటికి వెళ్లి చూడగా బాల్కనీలో శ్రీనివాస్‌ ఉరేసుకుని కనిపించాడు. షాక్‌కు గురైన ఆమె చుట్టుపక్కల వారికి సమాచారం అందించారు. కాగా స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఇంటి లోపల శ్రీనివాస్‌ భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి మృతదేహాలు ఉన్నాయి. వాళ్ల గొంతులు కోసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీనివాస్‌ ఇటీవల ఆస్పత్రి పెట్టాడని, నష్టాలు రావడంతో దాన్ని అమ్మేశాడని, అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని స్థానికులు అనుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆయనే కుటుంబాన్ని హతమార్చి ఆపై ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పోలీస్‌ కమిషన్‌ రామకృష్ణ పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Next Story