మేకపై సామూహిక అత్యాచారం.. ప్రధానిపై విమర్శలు
Five men Gang raped and killed a Goat in Pakistan.కామాంధులు కన్నుమిన్ను కానడం లేదు. మహిళలపై అఘాయిత్యాలకు
By తోట వంశీ కుమార్ Published on 30 July 2021 11:26 AM ISTకామాంధులు కన్నుమిన్ను కానడం లేదు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న కామాంధులు జంతువులను కూడా వదలడం లేదు. నేటి వరకు మహిళలకే భద్రత కరువుతుందుకున్న సమయంలో జంతువులకు కూడా రక్షణ లేకుండా పోతుంది. మాజీ దౌత్యవేత్త షౌకత్ ముకదమ్ కూతురు నూర్ ముకదమ్ పై ఆమె స్నేహితులే సామూహిక లైంగిక దాడికి పాల్పడటం, నిందితులను పోలీసులు అరెస్టు చేయకపోవడంపై మహిళాలోకం ఉద్యమిస్తున్న సమయంలోనే పాకిస్థాన్‌లో మరో షాకింగ్ ఘటన జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు దుర్మార్గులు మేకపై అత్యాచారానికి పాల్పడ్డారు.
పంజాబ్ ప్రావిన్స్‌లోని ఒకారా జిల్లాలోని ఓ కార్మికుడు ఇంటి ముందు ఉన్న కాంపౌండ్‌లోని మేకను ఐదుగురు దుండగులు అపమరించారు. అనంతరం దానిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి దానిని చంపేశారు. అక్కడి నుంచి నిందితులు పారిపోవడాన్ని అక్కడనే ఉన్న స్థానికులు చూశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ అఘాయిత్యాన్ని వ్యతిరేకిస్తూ అనేకమంది సోషల్ మీడియాలో నిరసనలు తెలుపుతున్నారు.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 'ఇప్పుడు చెప్పండి ప్రధాని గారూ. మేకలు కూడా వాటి వస్త్రాధరణ కారణంగానే అత్యాచారానికి గురవుతున్నాయి కదా' అంటూ వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. 'నగ్నంగా ఉండే జంతువులు కూడా పురుషులపై ప్రభావం చూపుతాయా..? 'అని కొందరు ప్రశ్నించగా.. 'మూగజీవాలకు బురఖా వేస్తామని చెబుతారా..?' అని మరికొందరు మండిపడుతున్నారు. ఇక పాకిస్తానీ నటి మథిర.. మేకపై అఘాయిత్యానికి సంబంధించిన న్యూస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. జంతువులకు కూడా దుస్తులు ధరించడం అవసరం అంటూ సెటైర్లు పేల్చారు.
మహిళలు పొట్టి దుస్తులు ధరిస్తే మగవాళ్లపై కచ్చితంగా ప్రభావం ఉంటుందంటూ కొద్ది రోజుల కిందట పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ మాట మార్చారు.