మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసి గ్యాంగ్ రేప్.. కిటికీలోంచి దూకడంతో..

Five men abducted and raped a minor girl in Lucknow, investigation underway. ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. లక్నోలోని సైర్‌పూర్‌లో ఐదుగురు వ్యక్తులు మైనర్ బాలికను కిడ్నాప్

By అంజి  Published on  8 Sept 2022 5:45 PM IST
మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసి గ్యాంగ్ రేప్.. కిటికీలోంచి దూకడంతో..

ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. లక్నోలోని సైర్‌పూర్‌లో ఐదుగురు వ్యక్తులు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక స్థానిక పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. అయితే, బాలిక కిడ్నాపర్ల బారి నుంచి తనను ఉంచిన ఇంటి కిటికీలోంచి దూకి తప్పించుకోగలిగింది. వెంటనే బక్షి కా తలాబ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బాధితురాలు ఫిర్యాదు చేసింది. నితిన్, నీరజ్‌తో సహా ఐదుగురు వ్యక్తులు తన పాఠశాల సమీపంలో కారులో తనను అపహరించినట్లు బాలిక వెల్లడించింది.

నిందితులను తనను సైర్‌పూర్‌లోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లారని బాలిక చెప్పింది. రాత్రంతా ఒంటరి గదిలో ఉంచారని, గురువారం ఉదయం కిటికీ నుండి దూకి తప్పించుకున్నానని చెప్పింది. బాలికను బందీగా ఉంచి ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఐదుగురు వ్యక్తులపై కిడ్నాప్‌తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు నార్త్ జోన్ డీసీపీ ఖాసీం అబ్ది తెలిపారు. త్వరలో నిందితులను పట్టుకుంటామన్నారు.

Next Story