ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

Five members of family found dead. ఆర్థిక ఇబ్బందులు తాళ‌లేక‌ ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు.

By Medi Samrat  Published on  7 March 2021 12:06 PM IST
Five members of family found dead

ఆర్థిక ఇబ్బందులు తాళ‌లేక‌ ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లా ప‌ఠాన్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. ఉరేసుకుని ఇద్దరు, కాలిన గాయాలతో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనాస్థలిలో పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.


ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కార‌ణ‌మ‌ని లేఖలో రాసిన‌ట్లు పోలీసులు తెలిపారు. మృతులను రామ్ బ్రిజ్ గయాక్వాడ్ (55), అతని భార్య జంకీ బాయి (45), కుమారుడు సంజు గయాక్వాడ్ (24), కుమార్తెలు దుర్గా (28), జ్యోతి (21)లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి తరలించారు.

సైబర్ సెల్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందం ప్రస్తుతం సంఘటనా స్థలంలో పరిశీలిస్తోంది. పోస్టుమార్టం తరువాత పూర్తివివరాలు తెలుస్తాయని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మృతులు చ‌నిపోయిన ప్రాంతం సీఎం ప్రాతినిథ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం విశేషం.





Next Story