ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మహిళల దుర్మరణం

తమిళనాడు రాష్ట్రంలోని నమక్కల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, కంటైనర్ లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి.

By అంజి  Published on  28 Feb 2023 11:27 AM IST
Accident, Namakkal District,  road accident, Tamil Nadu

ప్రతీకాత్మకచిత్రం

తమిళనాడు రాష్ట్రంలోని నమక్కల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, కంటైనర్ లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మహిళలు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన మంగళవారం ఉదయం పార్మతి వేలూరులో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కంటైనర్‌ లారీ ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఐదుగురు స్పాట్‌లో చనిపోయారని పోలీసులు తెలిపారు.

నుజ్జునుజ్జయిన వాహనం నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు రెస్క్యూ అధికారులు కట్టర్ ద్వారా వాహనాన్ని కట్ చేయాల్సి వచ్చింది. మృతదేహాలను బయటకు తీసిన అనంతరం.. పోస్టుమార్టం నిమిత్తం నమక్కల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీ, కారు రెండు వాహనాలు అతి వేగంతో ఉన్నాయని అధికారులు తెలిపారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

Next Story