నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on  20 Sept 2023 7:45 PM IST
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద కారు అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత కారు కూడా పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు ప్రమాద స్థలంలోనే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల‌ను మద్దిమడుగు ప్రసాద్, ఆయన కుమారుడు అవినాష్, కారు డ్రైవర్ మణిపాల్‌గా గుర్తించారు.

ప్రసాద్‌ తన భార్య, కుమారుడితో కలిసి హైదారాబాద్ నుంచి చింతపల్లి మండలం అంకపల్లికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. నసర్లపల్లి వద్ద వేగంగా వచ్చిన కారు.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలతో ప్రసాద్, అవినాష్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కారు డ్రైవర్ మణిపాల్ మృతి చెందాడు. క్షతగాత్రులను దేవరకొండ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలిస్తుండ‌గా వారు కూడా మార్గ‌మ‌ధ్యంలో మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు ఆరా తీస్తున్నారు.

Next Story