కర్నాటకలోని క్వారీల్లో బాంబుల మోత కొనసాగుతుంది. సరిగ్గా నెలక్రితం జరిగిన ఘటనను మరవకుండానే.. తాజాగా శివమొగ్గ జిల్లాలోని చిక్‌బళ్లాపూర్ తాలూకలోని ఓ క్వారీలో భారీ పేలుడు సంభవించింది. జిలెటిన్ స్టిక్స్ పేలిన ఈ ఘటనలో ఐదురుగు మృతి చెందారు. మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను జిల్లా హాస్పిటల్‌కు హాస్పిటల్‌కు తరలించారు. కాగా, పేలుడు ధాటికి దాదాపు పది కిలోమీటర్ల దూరం వరకు ప్రకంపనలు వచ్చాయి.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే.. జనవరి 21న కూడా శివమొగ్గలోని ఓ క్వారీలో భారీ పేలుడు సంభవించింది. అబ్బలగిరె గ్రామ సమీపంలో డైనమైట్ పేలిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. క్వారీకి ఉపయోగించే పేలుడు పదార్థాలను తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో వాహనం పూర్తిగా దెబ్బతింది.